ఒకవైపు దేశంలో పౌరసత్వ సవరణ చట్టంపై భారత్‌లో నివసిస్తున్న ఇతర దేశస్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కర్ణాటక రాష్ట్రంలో నివసిస్తున్న బౌద్ధులు భారత పౌరసత్వం పట్ల వారు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లలోని ముస్లిమేతరులందరికీ భారతదేశంలో పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టాన్ని ఉద్దేశించినప్పటికీ ప్రత్యేక టిబెట్ కోసం దశాబ్ధాలు పోరాడుతూ భారత్‌లో ఆశ్రయం పొందుతున్న వేలాదిమంది బౌద్ధ భిక్షవులు మాత్రం తమకు ఇండియన్ సిటిజన్‌షిప్ అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.

Also Read:పౌరసత్వ రగడ: ఎర్రకోట వద్ద రణరంగం, ప్రముఖుల అరెస్ట్

టిబెట్‌లో జరిగిన స్వతంత్ర పోరాటాల సందర్భంగా 1959లో వేలసంఖ్యలో ప్రజలు భారత్‌కు తరలివచ్చారు. ఆ సమయంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు, చామరాజనగర్, ఉత్తర కన్నడ జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

దీర్ఘకాలంగా భారత్‌లో నివసిస్తున్నప్పటికీ వారు ఎలాంటి పౌరసత్వం మాత్రం పొందలేదు. వారి వద్ద ఒక్క పాస్‌పోర్ట్ మినహా ఆధార్‌కార్డ్, ఓటరు గుర్తింపు కార్డులు లేవు. కాగా భారతదేశంలో 1960 నుంచి 1987 వరకు జన్మించిన టిబెటియన్‌లకు పౌరసత్వం కల్పిస్తున్నా దీనిని తీసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపటం లేదు. 

Also Read:మద్రాస్ యూనివర్సిటీలో పౌరసత్వ సెగ: కమల్ హాసన్‌ను అడ్డుకున్న సిబ్బంది

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మరోసారి ఆందోళనకారులు రెచ్చిపోయారు. సామాన్యులకు తోడు ప్రముఖులు సైతం రోడ్ల మీదకు వచ్చారు.

ఎర్రకోట వద్దకు పెద్దఎత్తున నిరసనకారులు చేరుకోవడంతో అక్కడ పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ను అరెస్ట్ చేశారు