పౌరసత్వ రగడ: ఎర్రకోట వద్ద రణరంగం, ప్రముఖుల అరెస్ట్
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మరోసారి ఆందోళనకారులు రెచ్చిపోయారు.
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మరోసారి ఆందోళనకారులు రెచ్చిపోయారు.
సామాన్యులకు తోడు ప్రముఖులు సైతం రోడ్ల మీదకు వచ్చారు. ఎర్రకోట వద్దకు పెద్దఎత్తున నిరసనకారులు చేరుకోవడంతో అక్కడ పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ను అరెస్ట్ చేశారు.
Also Read:మద్రాస్ యూనివర్సిటీలో పౌరసత్వ సెగ: కమల్ హాసన్‌ను అడ్డుకున్న సిబ్బంది
సీఏఏను వ్యతిరేకిస్తూ వేలాది మంది ఢిల్లీకి తరలి వస్తుండటంతో పోలీసులు ఢిల్లీ-గురుగ్రామ్ జాతీయ రహదారిపై బారీకేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తుండటంతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు, 16 మెట్రో స్టేషన్‌ల గేట్లను మూసివేశారు.
Also Read:పౌరసత్వ చట్టం... ముస్లింలకు ఏమీకాదు.. షాహీ ఇమామ్
ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. జామియా ఇస్లామియా ఉదంతం దృష్ట్యా ఎర్రకోట వద్ద లాఠీఛార్జీని నిషేధించారు. మరోవైపు బెంగళూరు టౌన్ హాల్ సమీపంలోని సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.