Asianet News TeluguAsianet News Telugu

తీహార్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీ ఆత్మహత్య.. ఫ్యాన్ కు ఉరేసుకుని...

తీహార్ జైల్లో ఓ అండర్ ట్రయల్ ఖైదీ ఉరేసుకుని మృతి చెందాడు. కిడ్నాప్, రేప్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఈ ఖైదీ పోక్సో చట్టం కింద గత నాలుగు నెలలుగా జైలులో ఉన్నాడు. 

Under trial hangs self in tihar jail
Author
Hyderabad, First Published Jun 25, 2022, 7:17 AM IST

తీహార్ : tihar jailలో ఓ ఖైదీ suicide చేసుకున్న ఘటన కలకలం రేపింది. 19యేళ్ల అండర్ ట్రయల్ ఖైదీలు Ceiling fanకు విగతజీవిగా వేలాడుతూ కనిపించినట్లు అధికారులు తెలిపారు.  ఉత్తర ప్రదేశ్లోని బదౌన్ జిల్లాకు చెందిన బ్రహ్మ్ నంద్ అలియాస్ వికాస్ కిడ్నాప్, రేప్ కేసుల్లో Pocso Act ప్రకారం ఫిబ్రవరి 4 నుంచి జైలులో ఉన్నట్లు సీనియర్ జైలు అధికారులు వెల్లడించారు. వికాస్  జైలులోని మొదటి అంతస్తులో అండర్ ట్రయల్ ఖైదీలు రికార్డు రూమ్లో సేవదార్ గా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఎప్పటిలాగా రికార్డు రూంకు వచ్చిన వికాస్..మళ్లీ కనిపించలేదు.మధ్యాహ్నం 2.50గంటలకు తన గది తలుపులు మూసి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన తోటి ఖైదీలు తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు.

అప్పటికే వికాస్ ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు.  వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా ..వికాస్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే ఏడాది జనవరిలో తీహార్ జైలులో ఐదుగురు ఖైదీలు ఆత్మహత్య ప్రయత్నించటం సంచలనం రేకెత్తించింది. పదునైన ఆయుధాలతో తమను తాము తీవ్రంగా గాయపరచుకున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు గాయపడ్డ ఐదుగురిని జైలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఓ ఖైదీని దీన్ దయాల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios