Asianet News TeluguAsianet News Telugu

గోవా ఎన్నిక‌ల్లో టీఎంసీతో ఎంజీపీ దోస్తాన్ !

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల హీట్ మొద‌లైంది. అన్ని ప్రాంతాల‌కు విస్తరించాల‌ని చూస్తున్న తృణ‌ముల్ కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల‌తో పొత్తుల‌ను పెట్టుకుంటోంది. ఇక గోవాలో గ‌తంలో బీజేపీకి భాగ‌స్వామ్య పార్టీగా వ్య‌వ‌హ‌రించిన ఎంజీపీ రానున్న ఎన్నిక‌ల్లో టీఎంసీతో క‌లిసి ముందుకు సాగ‌నున్న‌ట్టు వెల్ల‌డించింది.
 

Trinamool Ties Up With MGP In Goa
Author
Hyderabad, First Published Dec 6, 2021, 5:03 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వ‌చ్చే ఏడాది ప‌లు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వాటిలో పంజాబ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, మ‌ణిపూర్‌, ఉత్తరాఖండ్‌, గోవా రాష్ట్రాలు ఉన్నాయి.  ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాల్లో అధికార పీఠం ద‌క్కించుకోవ‌డానికి ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని వేగ‌వంతం చేశాయి. అలాగే, వివిధ  పార్టీల‌తో పొత్తులు పెట్ట‌కోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే  స్థానిక రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఊహించ‌ని విధంగా మారుతున్నాయి.  గోవాలో బీజేపీ పార్టీకి గ‌తంలో భాగ‌స్వామ్య ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించిన మ‌హారాష్ట్రవాది గోమంత‌క్ పార్టీ (ఎంజీపీ) రానున్న గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈసారి మ‌మ‌తా బెన‌ర్జీ సార‌థ్యంలోని  తృణ‌మూల్ కాంగ్రెస్‌తో క‌లిసి ముందుకు సాగ‌నుంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణ‌ముల్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనున్నామ‌ని సోమ‌వారం నాడు ఎంజీపీ ప్ర‌క‌టించింది. 

Also Read: భార‌త్, ర‌ష్యా మ‌ధ్య పలు ర‌క్ష‌ణరంగ‌ ఒప్పందాలు

గోవాలో వ‌చ్చే ఏడాది జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం గురించి మ‌హారాష్ట్రవాది గోమంత‌క్ పార్టీ (ఎంజీపీ) అధ్య‌క్షుడు దీప‌క్ ధ‌వ‌ళిక‌ర్ మీడియాతో మాట్లాడుతూ.. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో జ‌రిగే గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్‌తో క‌లిసి పోటీచేయాల‌ని పార్టీ కేంద్ర క‌మిటీ నిర్ణ‌యించింద‌ని వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌న్నారు. అలాగే, ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధి ఎవ‌ర‌నేది ఆ త‌ర్వాత నిర్ణ‌యిస్తామ‌ని తెలిపారు. గోవా ప్ర‌జ‌ల‌కు మెరుగైన పాల‌న అందించేందుకే ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌ప్ప‌కుండా తాము అధికారంలోకి వ‌స్తామ‌ని తెలిపారు. ఇక రాష్ట్రంలో ప్ర‌స్తుతం బీజేపీపై ప్ర‌జ‌లు అసంతృప్తిగా ఉన్నార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల్లో బీజేపీకి వ్య‌తిరేకత వ్య‌క్తమ‌వుతున్న‌ద‌ని తెలిపారు. 

Also Read: మ‌య‌న్మార్ లీడ‌ర్ ఆంగ్ సాన్ సూకీకి నాలుగేండ్ల జైలు శిక్ష

ఇదిలావుండ‌గా, 40 మంది స‌భ్యుల‌తో కూడిన గోవా అసెంబ్లీకి 2017లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. అయితే, బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి స్థానిక పార్టీల‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.  గోవా సీనియ‌ర్ నేత మ‌నోహ‌ర్ పారిక‌ర్ మ‌ర‌ణించిన త‌ర్వాత అక్క‌డ రాజ‌కీయ ప‌రిస్థితులు మారాయి.  ఈ సారి గోవా ఎన్నిక‌ల్లో తృణ‌ముల్ కాంగ్రెస్‌తో పాటు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా పోటీ చేయ‌డానికి సిద్ధ‌మైంది. ఎలాగైనా అధికారాన్ని ద‌క్కించుకోవాల‌ని ప్రణాళిక‌లు ర‌చిస్తోంది.  గోవాలోనే కాకుండా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఇత‌ర రాష్ట్రాల్లోనూ పోటీ చేయ‌డానికి ఆప్‌, తృణ‌ముల్ కాంగ్రెస్ పార్టీలు సిద్ధ‌మ‌య్యాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రచారాన్ని సైతం ప్రారంభించాయి. చూడాలి ప్ర‌ధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు ఆప్‌, తృణ‌ముల్ కాంగ్రెల‌లో గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలాగే, 2022 ప్రారంభంలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఇప్పటికే రాజకీయాలు వేడెక్కాయి. ప్రచార హోరును పెంచుతూ.. ఆయా పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలతో మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. 

Also Read: వ్యాక్సినేషన్ లో భారత్ మరో ఘనత .. ఇదే వేగాన్ని కొనసాగిద్దాం: ప్రధాని మోడీ

Also Read: నాగాలాండ్‌ ఘటనపై నేడు పార్లమెంట్‌లో అమిత్ షా ప్రకటన

 
 

Follow Us:
Download App:
  • android
  • ios