నాగాలాండ్ ఘటనపై నేడు పార్లమెంట్‌లో అమిత్ షా ప్రకటన
ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్‌లో మిలిటెంట్లుగా భావించి సాధారణ పౌరులపై భద్రతా బలగాలు శనివారం నాడు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం హాట్ టాపిగా మారింది. దీనిపై నేడు పార్లమెంట్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయన్నారు.
ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్‌లో మిలిటెంట్లు భావించి సాధారణ పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అంశం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణంగా అంటూ ప్రతిపక్షాల ప్రధాని మోడీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాల ఎన్ని విమర్శలు చేస్తున్న దీనిపై కేంద్రం స్పందించలేదు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై తెరపైకి రానుంది. ఈ ఘటనపై మరింత వివాదం కాకముందే కేంద్రం దీనికి వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో అమిత్‌షా దీనిని పై వివరణ ఇవ్వనున్నారు. పార్లమెంట్ వేదికగా ఈ ఘటనకు సంబంధించిన పలు వివరాలపై సోమవారం నాడు ఆయన ప్రకటన చేయనున్నారు.
Also Read: భారత్‌లో 8,306 కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్..
రాజ్యసభతో పాటు, లోక్‌సభలోనూ నాగాలాండ్ ఘటనపై అమిత్ షా ప్రకటన చేయనున్నారని సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభలో ఈ ఘటనపై స్పందించనున్నారు. ఆ తర్వాత మళ్లీ 4 గంటల సమయంలో రాజ్యసభలో నాగాలాండ్ ఘటనపై అమిత్‌షా మాట్లాడనున్నట్లు పార్లమెంటరీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక నాగాలాండ్ ఘటన నేపథ్యంలో కేంద్ర హోం శాఖపై ప్రతిపక్షాల తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై చర్చ కోసం ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజ్యసభ, లోక్‌సభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. సోమవారం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై రచ్చ జరిగే అవకాశాలున్నాయి. దీనిపై ఆందోళనలు చేయనున్నట్టు ప్రతిపక్ష పార్టీలు ప్రణాళికలేసుకున్నాయని తెలుస్తోంది.
Also Read: భారత్-రష్యా మధ్య 21వ శిఖరాగ్ర సదస్సు.. కీలక ఒప్పందాలపై సంతకాలు
ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీని (సిట్)ను ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబాలు న్యాయం జరిగేలా చూస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే, భారత ఆర్మీ ఉన్నతాధికారులు సైతం దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటన బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలావుండగా, పౌరులపై కాల్పులు జరిపిన పారా స్పెషల్ ఎలైట్ యూనిట్‌పై కేసు నమోదైంది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన నాగాలాండ్ పోలీసులు.. పారా స్పెషల్ ఎలైట్ యూనిట్ పై కేసు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఈ క్రమంలోనే సంచలన ఆరోపణలు చేశారు. భద్రతా బలగాలు ఉద్దేశపూర్వకంగానే కాల్పులకు పాల్పడినట్టు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపి పౌరుల ప్రాణాలు తీశారని తెలిపారు. అనేక మందిని తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సమయంలో తమ సహాయం కోరలేదని, దీని గురించి తమకు ఎటువంటి సమాచారమూ అందించలేదని తెలిపారు. కాగా, నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో మొత్తం 14 మంది మరణించారు. కాల్పుల నేపథ్యంలో స్థానికులు తిరగబడటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Also Read: విదేశీ కంపెనీల చేత్తుల్లోకి తెలంగాణ భూ వివరాలు.. రాములమ్మ సంచలన వ్యాఖ్యలు