Asianet News TeluguAsianet News Telugu

ఆ ఐదు రాష్ట్రాల్లో మహిళలపైనే రాజకీయ పార్టీల నజర్ ఎందుకు?

దేశంలో రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలతో పాటు ఇరత పార్టీలు సైతం మహిళల కోసం పథకాలు ప్రకటించడంలో పోటీ పడుతున్నాయి. ఒక పార్టీని మించి మ‌రో పార్టీ మ‌హిళ‌ల కోసం స‌రికొత్త ప‌థ‌కాల హామీలు గుప్పిస్తున్నాయి. అయితే, ఆయా రాష్ట్రాల్లో ఈ ప‌రిస్థితులు కార‌ణాలేంటి? అస‌లు మ‌హిళ‌ల పైనే రాజాకీయ పార్టీలు న‌జ‌ర్ ఎందుకు పెడుతున్నాయి? 
 

Why parties in India are eyeing female votes
Author
Hyderabad, First Published Dec 5, 2021, 1:21 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల్లో  రాజకీయ పార్టీలు అన్ని మహిళల కోసం కొత్త ప‌థ‌కాలు ప్ర‌క‌టించ‌డం, హామీలు ఇవ్వ‌డంలో పోటీ ప‌డుతున్నాయి.  సాధార‌ణంగా ఎన్నిక‌లు అన‌గానే ప్ర‌చారాలు ఊపందుకోవ‌డం, అందులో భాగంగా కొత్త ప‌థ‌కాల ప్ర‌క‌టించ‌డం, అసాధార‌ణ‌మైన హామీలు సైతం ఇవ్వ‌డం సాధార‌ణ‌మే.  అయితే, ఈ సారి ఎన్నికలు జ‌ర‌గ‌బోయే రాష్ట్రాల్లో మాత్రం రాజ‌కీయా పార్టీలు కొత్త హామీలు, ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌నే టార్గెట్  చేసుకుని ఉంటున్నాయి. ఈ ధోర‌ణ‌లు ఆయా రాష్ట్రాల్లో పెరుగుతున్న మ‌హిళా ఓట‌రు శ‌క్తికి ప్ర‌తిబింబంగా నిలుస్తోంది. మ‌హిళా ఓట‌ర్లు క్ర‌మంగా పెరుగుతున్నట్టు  కూడా సూచిస్తుంది.  వ‌చ్చే ఏడాది 2022లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, ఉత్త‌రాఖండ‌, గోవా, మ‌ణిపూర్‌ల‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ రాష్ట్రాల్లో మ‌హిళా ఓట‌ర్లు కీల‌కం కావ‌చ్చ‌నే నేప‌థ్యంలోనే రాజ‌కీయా పార్టీల‌న్ని మ‌హిళ‌లోకం చుట్టు తిరుగుతోంది. 

Also Read: సింగరేణి కాలనీ తరహాలో మరో ఘ‌టన.. ట్రంకుపెట్టెలో ఆరేళ్ల చిన్నారి..

రాష్ట్రాల్లోని ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఇవి.. 

ఉత్తరప్రదేశ్: వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న అతి పెద్ద రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఇటీవ‌లే ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మహిళలను "అధికారంలో పూర్తి స్థాయి భాగస్వామి"గా చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. మహిళా అభ్యర్థులకు తమ పార్టీ 40% టిక్కెట్లు  ఇస్తుంద‌ని ఆమె ప్రకటించారు. అలాగే, తాము అధికారంలోకి వస్తే మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. 

Also Read: క‌రోనా పంజా.. ఒక్క‌రోజే 2,796 మంది మృతి

పంజాబ్: పంజాబ్ లోనూ రాజ‌కీయ పార్టీలు మ‌హిళ‌ల‌ను హామీల‌తో ఉక్కిరిబిక్క‌రి చేస్తున్నాయి.  ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని ఆప్ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. దానిలో భాగంగానే ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ఇటీవల 18 ఏండ్ల  కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలందరికీ నెలకు రూ.1,000 ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇక అధికార పార్టీ ఉచిత బస్సు  ప్ర‌యాణాలు,  ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు, నిరుపేద వర్గాల బాలికల పెండ్లిండ్ల‌కు ఆర్థిక సాయాన్నివంటి చ‌ర్య‌లు ప్రారంభించింది. 

Also Read: ఆర్థిక చాణక్యుడు.. అత్య‌ధిక‌సార్లు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన రోశ‌య్య‌

ఉత్తరాఖండ్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల సీఎం గసియారి యోజనను ప్రారంభించారు.  కొండ ప్రాంతాల్లో నివాస‌ముంటున్న‌ మహిళలు పశువుల మేతను సేకరించడానికి దాదాపు 2నుంచి 10 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. దీని కోసం గ‌సియారి యోజ‌న కింద మేత‌ను సేక‌రించ‌డానికి ప్ర‌త్యేక కిట్‌ను అందిస్తామ‌న్నారు. 

Also Read: కాంగ్రెస్ నుంచి మరో కొత్త పార్టీ రానుందా?.. సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు

ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. అయితే, రాజ‌కీయా పార్టీలు మ‌హిళ‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించ‌డానికి వారి ఓట్ల శాతం గ‌ణ‌నీయంగా పెర‌గ‌డ‌మేన‌ని తెలుస్తోంది.  ఇప్పుడు పార్టీల గెలుపులో ఓ నిర్ణ‌యాత్మక శ‌క్తిగా మహిళలు ఎదుగుతున్నారు. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, గత మూడు అసెంబ్లీ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటే, మహిళా ఓటర్ల భాగస్వామ్యం 21% పైగా పెరుగుద‌ల న‌మోదుచేసుకుంది.  పంజాబ్ లోనూ  పురుష, మహిళా ఓటర్ల ఓటింగ్ మధ్య అంతరం పెరుగుతోంది. పంజబ్ విశ్వవిద్యాలయానికి చెందిన రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ అశుతోష్ మాట్లాడుతూ, "ఈ రోజుల్లో ఎక్కువ మంది మహిళలు ఓటు వేయడానికి కారణం వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మరింత అవగాహన పొంద‌డమేన‌ని అన్నారు. అలాగే, యువత జీవనోపాధి కోసం బయటకు వెళ్ల‌డం కూడా ఓ కార‌ణం" అని అన్నారు.   ఇక ఉత్త‌రాఖండ్‌లో 2007లో మ‌హిళా ఓటింగ్ 0.5 శాతంగా ఉండ‌గా, గ‌త ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి 7.06 శాతానికి పెరిగింది. ఇక మ‌ణిపూర్‌లో పురుషుల కంటే మ‌హిళా ఓట‌ర్లు అధికంగా ఉన్నారు.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌మిళా ఓట‌ర్లు దాదాపు పురుషుల‌కు స‌మానంగా ఉన్నారు. ఉత్త‌రాఖండ్‌లో 78.45 ల‌క్ష‌ల ఓట‌ర్లు ఉండ‌గా, అందులో 40.87 ల‌క్ష‌ల మంది మ‌గ‌వాళ్లు, 37.58 లక్ష‌ల మంది ఆడ‌వాళ్లు ఉన్నారు. 

Also Read: పెగాసస్.. ఎన్ఎస్ వో నిషేధంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు

Follow Us:
Download App:
  • android
  • ios