Asianet News TeluguAsianet News Telugu

భార‌త్, ర‌ష్యా మ‌ధ్య పలు ర‌క్ష‌ణరంగ‌ ఒప్పందాలు

భార‌త్‌లో ర‌ష్యా ప్ర‌భుత్వ ప‌ర్య‌ట‌న మొద‌లైంది. దీనిలో భాగంగా రెండు దేశాల మ‌ధ్య ర‌క్ష‌ణ రంగంలో ప‌లు కీల‌క ఒప్పందాలు కుదిరాయి. దీనిపై రెండు దేశాల ర‌క్ష‌ణ మంత్రులు సంత‌కాలు చేశారు. అలాగే, సోమ‌వారం సాయంత్రం ఐదు గంట‌ల‌కు ప్ర‌ధాని మోడీతో ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ కానున్నారు. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. 
 

India and Russia Sign 4 Defence Pacts
Author
Hyderabad, First Published Dec 6, 2021, 3:41 PM IST

భార‌తకు  అంత్యంత స‌న్నిహిత దేశ‌మైన ర‌ష్యాతో ప్ర‌తియేటా వార్షిక  స‌మావేశాలు జ‌రుగుతాయి. ఇప్ప‌టివ‌ర‌కు రెండు దేశాల అధినేత‌లు చాలా సార్లు భేటీ అయ్యారు. ర‌ష్యా, భార‌త్‌ల మ‌ధ్య ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 20 వార్షిక శిఖ‌రాగ్ర స‌మావేశాలు జ‌రిగాయి.  ప్ర‌స్తుతం జ‌ర‌గ‌నున్న‌ది 21వ శిఖ‌రాగ్ర స‌మావేశం. దీనిలో భాగంగా రెండు దేశాల మ‌ధ్య ర‌క్ష‌ణ రంగంలో ప‌లు కీల‌క ఒప్పందాలు కుదిరాయి. భార‌త ర‌క్ష‌ణ శాఖ  మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రి జ‌న‌ర‌ల్ సెర్గీ షొయిగులు ఆ ఒప్పందాల‌పై సంత‌కాలు చేశారు. 7.63x39mm క్యాలిబ‌ర్ క‌లిగిన ఏకే-203 అజాల్ట్ రైఫిళ్ల త‌యారీ అంశంలోనూ రెండు దేశాల మ‌ధ్య ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాల ర‌క్ష‌ణ మంత్రులు ఈ ఒప్పందంపై సంత‌కాలు చేశారు.  ఈ ఒప్పందంతో మొత్తం ఆరు ల‌క్ష‌ల ఏకే-203 రైఫిళ్ల‌ను త‌యారీ చేయ‌నున్నారు. 2021 నుంచి 2031 మ‌ధ్య కాలంలో ఆ ఆయుధాల‌ను స‌మీక‌రించ‌నున్నారు. క‌ల‌ష్నికోవ్ ఆయుధాల త‌యారీ గురించి 2019, ఫిబ్ర‌వ‌రిలో కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం ఏకే-203 రైఫిళ్ల‌ను త‌యారీ చేయ‌నున్నారు. సుమారు ₹ 5000 కోట్లతో భారత సాయుధ దళాల కోసం రైఫిల్స్‌ను తయారు చేయనున్నారు.

Also Read: మ‌య‌న్మార్ లీడ‌ర్ ఆంగ్ సాన్ సూకీకి నాలుగేండ్ల జైలు శిక్ష

ప్రస్తుతం కొన‌సాగుతున్న భార‌త్‌-ర‌ష్యా దేశాల ద్వైపాక్షిక స‌మావేశంలో భార‌త ర‌క్ష‌ణ మంత్రి శాఖ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్‌, విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌, ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రి జ‌న‌ర‌ల్ సెర్గీ షోయిగు, ర‌ష్యా విదేశాంగ మంత్రి సెర్గీ ల‌వ్‌రోవ్ పాల్గొన్నారు.  ఈ సంద‌ర్బంగా ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇటీవ‌లి   కాలంలో  భార‌త్, ర‌ష్యా మ‌ధ్య ర‌క్ష‌ణ రంగ స‌హ‌కారం అసాధార‌ణ రీతిలో ముందుకు సాగుతున్న‌ద‌ని అన్నారు. ఇరు ప‌క్ష‌ల భాగ‌స్వామ్యంతో ర‌క్ష‌ణ రంగం మెరుగైన ప్ర‌గ‌తి సాధించింద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం అనేక స‌వాళ్లు మ‌న ముందున్నాయ‌ని తెలిపారు. ఇప్పుడు ఎదుర్కొంటున్న  ప‌లు స‌వాళ్లు..  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ర‌ష్యా అతిపెద్ద భాగ‌స్వామిగా ఉంటుంద‌ని ఆశిస్తున్నట్టు రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ప్ర‌స్తుతం రెండు దేశాల మ‌ధ్య ర‌క్ష‌ణ స‌హాకారం కీల‌క‌మైంద‌న్నారు.  ఇరు దేశాల ప్రాంతీయ భ‌ద్ర‌త కోసం క‌లిసి ముందుకు సాగుతాయ‌ని అన్నారు. అలాగే, భార‌త విదేశాంగ మంత్రి జై శంక‌ర్ మాట్లాడుతూ.. భార‌త్, ర‌ష్యాల మ‌ధ్య బ‌ల‌మైన బంధం ఉంద‌ని అన్నారు. ఇది ధృఢంగా, విడ‌దీయ‌లేని బంధంగా ఉంద‌ని తెలిపారు.

Also Read: వ్యాక్సినేషన్ లో భారత్ మరో ఘనత .. ఇదే వేగాన్ని కొనసాగిద్దాం: ప్రధాని మోడీ

కాగా, భార‌త్,ర‌ష్యా మ‌ధ్య ప్ర‌తి సంత్స‌రం వార్షిక స‌ద‌స్సులు జ‌రుగుతాయి. రెండు దేశాల మ‌ధ్య ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 20వ వార్షిక శిఖ‌రాగ్ర స‌మావేశాలు జ‌రిగాయి.  ప్ర‌స్తుతం జ‌ర‌గ‌నున్న‌ది 21వ శిఖ‌,రాగ్ర స‌మావేశం. ఈ స‌మావేశానికి ఢిల్లీ వేదికైంది. అయితే,  రెండు దేశాధినేత‌ల మ‌ధ్య 21వ శిఖ‌రాగ్ర స‌మావేశం గ‌తేడాదే జ‌ర‌గాల్సి ఉన్న‌ది. అయితే, చైనాలోని వూహాన్ న‌గ‌రంలో క‌రోనా వైర‌స్ వెగులుచూడ‌టం, త‌క్కువ కాలంలోనే యావ‌త్ ప్ర‌పంచాన్ని చుట్టుముట్ట‌డం జ‌రిగిపోయింది. దీంతో గ‌తేడాది జ‌మావేశం జ‌ర‌గ‌లేదు. ప్ర‌స్తుతం భార‌త్‌లో క‌రోనా విజృంభ‌ణ కొద్దిగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో నేడు ఇరు దేశాధినేత‌ల మ‌ధ్య భేటీ జ‌రుగుతోంది.  ఈ రోజు సాయంత్రం ఐదు గంట‌ల‌కు ప్ర‌ధాని మోడీతో ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ కానున్నారు. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. అలాగే, ప్ర‌ధాని మోడీ ప్ర‌త్యేక విందు కార్య‌క్ర‌మాన్ని కూడా ఏర్పాటు చేశారు. భార‌త్ ప‌ర్య‌ట‌న ముగిసిన అనంత‌రం రాత్రి  9.30 గంటలకు పుతిన్‌ రష్యాకు తిరిగి వెళ్ల‌నున్నారు. 

Also Read: నాగాలాండ్‌ ఘటనపై నేడు పార్లమెంట్‌లో అమిత్ షా ప్రకటన

Follow Us:
Download App:
  • android
  • ios