విషాదం.. స్కూల్ లో విద్యార్థి విసిరిన జావెలిన్ తలకు గుచ్చుకుని 15 ఏళ్ల బాలుడు మృతి..
స్కూల్ లో జావెలిన్ ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో అది ఓ విద్యార్థి తలకు గుచ్చుకుంది. దీంతో తీవ్ర గాయాలతో ఆ బాలుడు మరణించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో చోటు చేసుకుంది.

స్కూల్ లో ఓ విద్యార్థి విసిరిన జావెలిన్ తలకు గుచ్చుకోవడంతో 15 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇది జిల్లా వ్యాప్తంగా విషాదం నింపింది. ఓ విద్యార్థి జావెలిన్ ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మన్గావ్ తాలూకా గోరెగావ్ లోని పురార్ లోని ఐఎన్ టీ ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో 15 ఏళ్ల హుజేఫా దవారే అనే బాలుడు చదువుతున్నాడు. ఎప్పటిలాగే బుధవారం స్కూల్ కు వెళ్లిన ఆ విద్యార్థి గ్రౌండ్ లో నడుస్తున్నాడు. ఈ క్రమంలో ఆ బాలుడు తన షూలేస్ కట్టుకోవడానికి కిందకి వంగిపోయాడు. అయితే అదే సమయంలో గ్రౌండ్ లో ఓ బాలుడు జావెలిన్ విసరడం ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ఇది మరో సీమా హైదర్ కథ.. సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడి కోసం రాజస్థాన్ కు వచ్చిన బంగ్లాదేశ్ మహిళ..
హుజేఫా దవారే అటు వైపు ఉన్న విషయం గమనించక ఆ బాలుడు జావెలిన్ ను విసిరాడు.. అక్కడ షూ లేస్ కట్టుకుంటున్న దవారే తలకు జావెలిన్ బలంగా గుచ్చుకుంది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన విద్యార్థిని స్కూల్ సిబ్బంది హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే బాలుడు మరణించాడు.
కాగా..తాలూకా స్థాయి పోటీలకు సిద్ధమవుతున్న జావెలిన్ బృందంలో దవారే కూడా ఉన్నారు. ఈ ఘటనపై జిల్లాలోని గోరేగావ్ పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే జావెలిన్ విసిరిన విద్యార్థి నిర్లక్ష్యం ఇందులో ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ లో ఏర్పాటు చేసిన, అలాగే గ్రౌండ్ ను కవర్ చేసే సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.