ఇది మరో సీమా హైదర్ కథ.. సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడి కోసం రాజస్థాన్ కు వచ్చిన బంగ్లాదేశ్ మహిళ..
బంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళకు సోషల్ మీడియాలో రాజస్థాన్ కు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది వారి మధ్య ప్రేమకు దారి తీసింది. అయితే అప్పటికే ఆ యువకుడికి పెళ్లయి, కుమారుడు కూడా ఉన్నాడు. కానీ అతడితో కలిసి జీవించేందుకు ఆమె రాజస్థాన్ లోని అతడికి ఇంటికి చేరుకుంది. తిరిగి తన దేశానికి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు.

పబ్జీ గేమ్ యాప్ లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్ నుంచి తన పిల్లలతో సహా యూపీకి వచ్చిన సీమా హైదర్ కథ మనందరికీ తెలుసు. ఆమె అరెస్టు అయిన తరువాత బెయిలపై విడుదలైంది. అయితే ఆమె పాకిస్థాన్ గూఢచార సంస్థకు చెందిన మహిళనా ? కాదా ? అనే విషయంలో ఓ వైపు దర్యాప్తు సాగుతున్న క్రమంలోనే తాజాగా మరో వైపు రాజస్థాన్ లోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
నా వ్యాఖ్యలను కాషాయ శిబిరం వక్రీకరించింది - బీజేపీపై ఉదయనిధి స్టాలిన్ ఫైర్.. తాజా లేఖ విడుదల
బంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళ తన దేశాన్ని వదిలిపెట్టి రాజస్థాన్ కు చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బంగ్లాదేశ్ కు చెందిన ఉమా హబీబా అలియాస్ హనీ అనే మహిళ రాజస్థాన్ రాష్ట్రం అనుప్ గఢ్ జిల్లాలోని రావ్లా గ్రామానికి వచ్చింది. తనకు సోషల్ మీడియాలో పరిచయమైన రోషన్ అనే యువకుడితో కలిసి జీవించేందుకు ఆమె సెప్టెంబర్ 3న కోల్ కతా, న్యూఢిల్లీ మీదుగా రాజస్థాన్ లోని అనుప్ గఢ్ కు వచ్చింది.
కొంత కాలం కిందట ఉమా హబీబాకు రోషన్ తో పరిచయం ఏర్పడింది. అయితే 2021లోనే అతడికి పెళ్లయ్యింది. ప్రస్తుతం ఏడు నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే సెప్టెంబర్ 3వ తేదీన అతడి భార్య సిర్సాలో ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో పాల్గొనేందుకు వెళ్లింది. అదే రోజు రోషన్ హబీబాను బికనీర్ నుంచి హబీబాను అనుప్ గఢ్ లోని తన నివాసానికి తీసుకొచ్చాడు.
కాగా.. హబీబా హిందీ స్పష్టంగా మాట్లాడుతున్నప్పటికీ.. ఆమెకు పంజాబీ అర్థం కావడం లేదు. టూరిస్ట్ వీసాపై ఉన్న ఆమె బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. అయితే ఈ విషయం తెలుసుకున్న అనూప్ గఢ్ పోలీసులు, అధికారులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఆమె గురించి తెలుసుకునేందుకు నిఘా వర్గాలు ఇప్పటికే పని మొదలుపెట్టాయి.