Feb 28 : Top Ten News @6PM .. ఏషియానెట్‌లో టాప్ 10 వార్తలు
ఫిబ్రవరి 28, 2024న ఏషియానెట్‌లో సాయంత్రం 6 గంటల వరకు టాప్ 10 వార్తలు ఇవే.
వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన జగన్.. వరుసగా ఐదే ఏడాది జమ
వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. రబీ 2021-22, ఖరీఫ్ 2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా ముఖ్యమంత్రి చెల్లించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. పూర్తి కథనం
మరోసారి ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఎప్పుడు, ఎందుకు? అంటే...
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. ఇది ఇప్పుడు ఢిల్లీని తాకుతోంది. టిడిపి జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే వందకు పైగా సీట్లను ప్రకటించాయి ఈ ఉమ్మడి పార్టీలు. తాడేపల్లి గూడెంలో నేడు సభ ముగిసిన తర్వాత చంద్రబాబునాయుడు ఇక్కడి నుంచి నేరుగా హైదరాబాదుకు చేరుకుంటారు. ఆ తరువాత మరో ఒకటి రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులు ఢిల్లీ వెళ్తారని ప్రచారం కొనసాగుతోంది. పూర్తి కథనం
ఈడీ సమన్లు జారీ చేస్తే.. విచారణకు హాజరుకావాల్సిందే : సుప్రీంకోర్ట్ సంచలన వ్యాఖ్యలు
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ)లోని సెక్షన్ 50 కింద సమన్లు పొందిన వ్యక్తి మనీలాండరింగ్ విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లను గౌరవించాలని , ప్రతిస్పందించాలని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. పిఎంఎల్‌ఎ కింద విచారణకు అనుగుణంగా అవసరమైతే ఈడి పిలిస్తే సమన్లు పొందిన వ్యక్తి తప్పనిసరిగా హాజరుకావాలని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. పూర్తి కథనం
మెడబట్టుకుని గెంటేసినంత చేశారు : చంద్రబాబు, లోకేష్‌లపై గొల్లపల్లి సూర్యారావు సంచలన వ్యాఖ్యలు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆ పార్టీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. నిబద్ధతతో పనిచేసిన తనను మెడబట్టుకుని గెంటేసినంత పనిచేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని సూర్యారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధలో వున్న తనను సీఎం వైఎస్ జగన్ అక్కున చేర్చుకున్నారని.. వైసీపీ కోసం శాయశక్తుల పనిచేస్తానని గొల్లపల్లి సూర్యారావు స్పష్టం చేశారు. పూర్తి కథనం
ఈ ఛాయ్ వాలా, టిఫిన్ మాస్టర్ ఎవరో గుర్తుపట్టారా..? (వీడియో)
ఎన్నికలు సమీపిస్తుండటంతో అంబటి ప్రజల బాట పట్టారు. ఇవాళ ఉదయం సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో పర్యటించిన అంబటి ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఐదు లాంతర్ల సెంటర్ లో ఓ టీ షాప్ వద్దకు వెళ్లారు... సరదాగా టీ కాసిన ఆయన స్వయంగా ఆయనే సర్వ్ చేసారు. అక్కడినుండి మరో షాప్ వద్దకు వెళ్లి దోసెలు వేసారు. మంత్రి హోదాలో వున్న అంబటి తన నియోజకవర్గంలో సామాన్యుడిలా కలియతిరిగారు. తమ నాయకుడు స్థానికులతో మమేకపోవడంతో వైసిపి శ్రేణులలో నూతన ఉత్సాహం నెలకొంది. పూర్తి కథనం
జనసేన పార్టీ కోసం 100 కోట్ల విలువైన ఆస్తులు అమ్మేస్తున్న పవన్ కళ్యాణ్.. షాకింగ్ డీటెయిల్స్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మరో నెలలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనితో పవన్ కళ్యాణ్ తాను నటిస్తున్న చిత్రాలన్నీ పక్కన పెట్టి పూర్తిగా పాలిటిక్స్ కోసం సమయం కేటాయిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇటీవల పవన్ ఒక హెలికాఫ్టర్ ని అద్దెకి కూడా తీసుకున్నారు. ఈ ఖర్చులన్నింటిని భరించాలంటే జనసేన పార్టీ ఫండ్స్ సరిపోవడం లేదు. పూర్తి కథనం
`అమ్మ`ని నమ్ముకుంటే లాభం లేదు.. మహేష్ బాబుకి మూడుసార్లు అనుభవం..
మహేష్ బాబు ఇటీవల `గుంటూరు కారం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందులోని మెయిన్ సెంటిమెంట్ వర్కౌట్ కాకపోవడమే అంటుంటారు. మదర్ సెంటిమెంట్ మహేష్ కి వర్క్ కాలేదు. దీంతో నిరాశ తప్పలేదు. ఇప్పుడే కాదు, గతంలో రెండు సార్లు మదర్ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. ఆయన `గుంటూరు కారం`కి ముందు `నాని` సినిమాని మదర్ సెంటిమెంట్‌తోనే చేశాడు. పూర్తి కథనం
గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్... ఆ సీజన్ పై కన్నేసిన రామ్ చరణ్!
గేమ్ ఛేంజర్ విషయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. దర్శకుడు శంకర్ కారణంగా ఈ ప్రాజెక్ట్ లేటు అవుతుంది. గేమ్ ఛేంజర్ విడుదలకు అద్భుతమైన డ్ డేట్ లాక్ చేయనున్నాడట నిర్మాత దిల్ రాజు. క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తే పండగ సెలవులతో పాటు లాంగ్ వీకెండ్ లభిస్తుందని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. గత ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన సలార్ డివైడ్ టాక్ తో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. పూర్తి కథనం
హైదరాబాద్‌లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. అఖిల్ తో సోనూసూద్ ఢీ.. ! వారికి ఫ్రీ ఎంట్రీ !
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు ఏ. జగన్మోహన్ రావు తెలిపారు. ఈ లీగ్ మొదటి దశ మ్యాచ్ లు షార్జాలో జరుగుతుండగా, రెండో దశ మ్యాచ్ లు మార్చి 1 నుంచి 3 వరకు హైదరాబాద్ వేదికగా జరుగుతాయని ఆయన తెలిపారు. దీంతో ఈ లీగ్ లో ఆడేందుకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు దేశంలోని ఇతర సినీ ప్రముఖులు, తారలు హైదరాబాద్ రానున్నారు. పూర్తి కథనం
IPL 2024: చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అవుతుందా?
మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024కు సర్వం సిద్దమైంది. మార్చి 22 నుంచి ఇండియా ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది సీజన్ ప్రారంభం కానుండగా, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కి ఎంఎస్ ధోని నాయకత్వం వహిస్తున్నాడు. గత ఐపీఎల్ మాదిరిగానే ఇప్పుడు కూడా ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అవుతుందా? అనే టాక్ నడుస్తోంది. పూర్తి కథనం