Asianet News TeluguAsianet News Telugu

ఈ ఛాయ్ వాలా, టిఫిన్ మాస్టర్ ఎవరో గుర్తుపట్టారా..? (వీడియో)

ఆంధ్ర ప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి తన సొంత నియోజకవర్గ ప్రజలకోసం చాయ్ వాలా, టిఫిన్ మాస్టర్ గా మారారు. 

Minister Ambati Rambabu making tea and Dosa AKP
Author
First Published Feb 28, 2024, 2:16 PM IST | Last Updated Feb 28, 2024, 2:19 PM IST

సత్తెనపల్లి : ప్రత్యర్థి పార్టీలపై, నాయకులపై పంచులు, సెటైర్లు వేయడంలో మంత్రి అంబటి రాంబాబు దిట్ట. ఇలా రాజకీయంగా ఎంత సీరియస్ గా వుంటారో ప్రజలతో అంతే సరదాగా వుంటారు. ఈ విషయం ఆయన సంక్రాంతి సంబరాల్లో చేసిన డ్యాన్స్ ను చూస్తే అర్థమవుతుంది. తాజాగా మరోసారి ప్రజలతో మమేకం అయ్యారు అంబటి. 

ఎన్నికలు సమీపిస్తుండటంతో అంబటి ప్రజల బాట పట్టారు. ఇవాళ ఉదయం సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో పర్యటించిన అంబటి ప్రజలతో ముచ్చటించారు.  ఈ సందర్భంగా ఐదు లాంతర్ల సెంటర్ లో ఓ టీ షాప్ వద్దకు వెళ్లారు... సరదాగా టీ కాసిన ఆయన స్వయంగా ఆయనే సర్వ్ చేసారు. అక్కడినుండి మరో షాప్ వద్దకు వెళ్లి దోసెలు వేసారు. ఇలా ఉన్నతమైన మంత్రి హోదాలో వున్న అంబటి తన నియోజకవర్గంలో సామాన్యుడిలా కలియతిరిగారు. తమ నాయకుడు స్థానికులతో మమేకపోవడంతో వైసిపి శ్రేణులలో నూతన ఉత్సాహం నెలకొంది. 

వీడియో

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios