జనసేన పార్టీ కోసం 100 కోట్ల విలువైన ఆస్తులు అమ్మేస్తున్న పవన్ కళ్యాణ్.. షాకింగ్ డీటెయిల్స్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మరో నెలలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనితో పవన్ కళ్యాణ్ తాను నటిస్తున్న చిత్రాలన్నీ పక్కన పెట్టి పూర్తిగా పాలిటిక్స్ కోసం సమయం కేటాయిస్తున్నారు. జనసేన పార్టీని, నాయకులని ఎన్నికలకి సంసిద్ధం చేస్తున్నారు.
టిడిపితో పొత్తులో భాగంగా జనసేనకి 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. దీనితో అన్ని స్థానాల్లో విజయం సాధించేలా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన పార్టీ ఎన్నికల ఖర్చు, అభ్యర్థుల ప్రచారం కోసం పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీకి ఫండ్స్ లేక పవన్ సతమతమవుతున్నారు.
ఎన్నికల ప్రచారం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇటీవల పవన్ ఒక హెలికాఫ్టర్ ని అద్దెకి కూడా తీసుకున్నారు. ఈ ఖర్చులన్నింటిని భరించాలంటే జనసేన పార్టీ ఫండ్స్ సరిపోవడం లేదు. దీనితో పవన్ తన ఆస్తులు అమ్మేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రూ. 100 కోట్ల రూపాయలు ఎన్నికలకు వెచ్చించేందుకు అంత విలువైన స్థలాలు, ఇల్లు అమ్మేస్తున్నారట.
ఆల్రెడీ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఒక స్ధలం, బెంగుళూరులో ఓ ఇల్లు అమ్మేసినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చు భారం కూడా పవన్ పైనే పడుతోందట. ఆల్రెడీ తాను నటించిన చిత్రాల రెమ్యునరేషన్ నుంచి 10 కోట్లు పవన్ జనసేన పార్టీకి ఇటీవలే కేటాయించారు. హెలికాప్టర్ రెంట్ ఇతర ఖర్చుల కోసం 20 కోట్ల ప్రాపర్టీ ని అమ్మేశారట.
జనసేన పార్టీ మొత్తం పవన్ కళ్యాణ్ భుజాలపైనే నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆస్తులు అమ్మేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పవన్ నిజంగానే పార్టీ కోసం ఆస్తులు అమ్మేస్తున్నారట. జనసేన పార్టీకి ఇటీవల కొందరు ఫండ్స్ ఇచినప్పటికీ వాళ్ళు టికెట్స్ ఆశించడంతో ఆ మొత్తాన్ని పవన్ తిరిగి వెనక్కి ఇచ్చేసినట్లు వార్తలు వచ్చాయి.
గత పదేళ్ల నుంచి పవన్ కళ్యాణ్ పార్టీని నడుపుతున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కి పూర్తిగా నిరాశే ఎదురైంది. పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోగా ఆ పార్టీ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. మరి 2024 లో అయినా పవన్ అనుకున్న ఫలితం దక్కుతుందేమో చూడాలి. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడం వల్ల హరిహర వీరమల్లు, ఉస్తాద్, ఓజి చిత్రాల షూటింగ్ ఆగిపోయింది.