Feb 27-Top Ten News: టాప్ టెన్ వార్తలు

ఫిబ్రవరి 27వ తేదీన టాప్ టెన్ వార్తలు.
 

todays top ten news on 27th of this month ksp

రూ. 500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకాలు: ప్రారంభించిన రేవంత్

రూ. 500 లకే గ్యాస్ సిలిండర్,  200 యూనిట్ల వరకు గృహావసరాలకు  ఉచిత విద్యుత్ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మంగళవారంనాడు  ప్రారంభించారు. తెలంగాణ సచివాలయంలో  ఇవాళ  రూ. 500లకే గ్యాస్ సిలిండర్,  గృహజ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్)ను  మంత్రులతో కలిసి తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారన్నారు. సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని  రేవంత్ రెడ్డి  చెప్పారు. పూర్తి కథనం

కేరళలో శత్రువులు, బయట బెస్ట్ ఫ్రెండ్స్.. వామపక్షాలు, కాంగ్రెస్ పై మోడీ విమర్శలు..

కాంగ్రెస్, వామ పక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేరళలో ఈ పార్టీ నాయకులంతా శత్రువులనీ కానీ బయట మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారని చెప్పారు. రాహుల్ గాంధీ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ స్థానం నుంచి సీపీఐ తన అభ్యర్థిని ప్రకటించిన మరుసటి రోజు ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వయనాడ్ నుంచి యువరాజును గద్దె దింపాలని వామపక్షాలు కోరుకుంటున్నాయని అన్నారు. పూర్తి కథనం

వైసీపీతో నాకు సంబంధం లేదు .. త్వరలోనే బీజేపీలో చేరతా : కాపు రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ సీనియర్ నేత, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. తాను ఎప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యేది తర్వాత తెలియజేస్తానని రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తాను‌ వైసీపీని పూర్తిగా వదిలేశానని ఆ పార్టీ తో నాకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ మీటింగ్ నుంచి తనకు ఎటువంటి సమాచారం లేదని వెల్లడించారు. రాజ్‌నాథ్ సింగ్‌ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చానని, త్వరలోనే అన్ని విషయాలు వివరిస్తానని రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పూర్తి కథనం

టిక్కెట్‌ నిరాకరణ .. తీవ్ర మనస్తాపంలో గొల్లపల్లి సూర్యారావు , టీడీపీని వీడేందుకు నిర్ణయం ..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి విడుదల చేసిన తొలి జాబితాతో రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తి సెగ రేగింది. ఈ క్రమంలోనే టీడీపీని వీడేందుకు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఆయన నుంచి స్పష్టమైన హామీ లభించిన తర్వాత వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే సూర్యారావును అమలాపురం నుంచి లోక్‌సభ బరిలో పంపాలని జగన్ డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. పూర్తి కథనం

Medaram Jathara: మేడారం జాతరలో ఎన్ని హుండీలు నిండాయి? అవి ఎవరికి చెందుతాయి?

మేడారం వనదేవతల జాతర ముగిసింది. ఈ సారి సమ్మక్క సారక్క జాతర గతంలో కంటే ఘనంగా జరిగింది. భక్తులు రికార్డు స్థాయిలో మేడారానికి వెళ్లారు. నెల రోజుల ముందు నుంచే భక్తుల తాకిడి పెరిగింది. సుమారు రెండు కోట్లకు పైగా భక్తులు సమ్మక్క, సారక్కలను మేడారంలో దర్శించుకున్నారు. మొక్కులతోపాటు కానుకలు కూడా చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మేడారంలో ఎన్ని హుండీలు పెట్టారు? అందులో ఎన్ని నిండాయి? నిండిన ఆ సొమ్ము ఎవరికి చెందుతుంది? అనే ఆసక్తి కూడా నెలకొంది. పూర్తి కథనం

నాగర్ కర్నూల్ ఎంపీ టిక్కెట్టు:మల్లు రవి, సంపత్ మధ్య పోటా పోటీ...

కాంగ్రెస్ పార్టీలో  నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం  నుండి పోటీ చేసేందుకు  నేతలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుండి పోటీకి  మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే  సంపత్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో  మల్లు రవి, సంపత్ కుమార్ కు చెందిన ఫ్లెక్సీలు  పోటా పోటీగా వెలిశాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దరిమిలా  పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి  కాంగ్రెస్ నేతలు కూడ ఆసక్తిని చూపుతున్నారు. పూర్తి కథనం

త్వరలో బిడ్డకు స్వాగతం పలకనున్న సిద్ధూ మూస్ వాలా తల్లిదండ్రులు.. ?

దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా తల్లిదండ్రులు తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తిని తీసుకురాబోతున్నారు. 58 ఏళ్ల తల్లి చరణ్ కౌర్, 60 ఏళ్ల బల్కౌర్ సింగ్ దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. చరణ్ కౌర్ గర్భవతిగా ఉందని, ఆమె త్వరలోనే బిడ్డను కనబోతోందని ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనం పేర్కొంది. మూస్ వాలా హత్య జరిగినప్పటి నుంచి తల్లిదండ్రులు తమ కుమారుడికి న్యాయం చేయాలంటూ ఉద్యమం చేస్తున్నారు.  పూర్తి కథనం

VarunTej కెరీర్‌లో ఒక్క సక్సెస్‌ క్రెడిట్‌ లేదు.. అయినా రిస్క్.. తాడో పేడో తేలే సమయం?

వరుస పరాజయాలతో వరుణ్‌ తేజ్‌ కెరీర్‌ కాస్త తడబాటుకు గురవుతుంది. ఇప్పుడు మరో రిస్క్ చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు ఆయన్ని టెన్షన్‌ పెడుతుంది.  మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ఆపరేషన్‌ వాలెంటైన్ చిత్రంతో ఆడియెన్స్  ముందుకు రాబోతున్నాడు. లావణ్య త్రిపాఠితో మ్యారేజ్‌ తర్వాత ఆయన్నుంచి వస్తోన్న మూవీ ఇది. హిందీ దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ రూపొందిస్తున్న మూవీ ఇది. ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. తెలుగులో ఇలాంటి మూవీ రాలేదు. మొదటి సారి రాబోతుంది. ఆడియెన్స్ ఎలా తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పూర్తి కథనం

లండన్‌ రెస్టారెంట్‌లో కూతురు వామికతో విరాట్ కోహ్లీ.. ఫోటో వైరల్‌

విరాట్ కోహ్లి కూతురు వామికతో ఓ రెస్టారెంట్లో ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఇటీవలే విరాట్, అనుష్క జంట మరోసారి తల్లిదండ్రులయ్యారు. వారికి మగబిడ్డ పుట్టగా.. ‘అకాయ్’ అని పేరు పెట్టినట్టుగా ప్రకటించారు. ఫిబ్రవరి 15న తమకు మగబిడ్డ పుట్టినట్టుగా ప్రకటించారు. విరాట్ కోహ్లీ దాదాపు నెల రోజులుగా  క్రికెట్ కు దూరంగా ఉంటున్నారు. వామిక పుట్టేముందు తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించిన విరుష్కా జంట. రెండో సంతానం విషయంలో చాలా రహస్యంగా ఉంచారు. పూర్తి కథనం

Fastest T20I hundred: టీ20 క్రికెట్‌లో స‌రికొత్త చ‌రిత్ర‌.. 33 బంతుల్లోనే సెంచ‌రీ.. !

ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ కు పేరుగాంచిన టీ20 క్రికెట్ లో మ‌రో స‌రికొత్త రికార్డు న‌మైంది. ప‌వ‌ర్ హిట్టింగ్ తో విధ్వంసం సృష్టిస్తూ అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీ న‌మోదైంది. కేవ‌లం 33 బంతుల్లోనే సెంచ‌రీ కొట్టి కొట్టాడు న‌మీబియా ప్లేయ‌ర్. నేపాల్ కు చెందిన కుశాల్ మల్లా నెలకొల్పిన ఫాస్టెస్ట్ టీ20 సెంచ‌రీ రికార్డు బ్రేక్ అయింది. కేవలం 33 బంతుల్లోనే విధ్వంసం సృష్టిస్తూ టీ20 చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయ‌ర్ గా నమీబియా క్రికెటర్ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ చరిత్ర సృష్టించాడు. పూర్తి కథనం

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios