Asianet News TeluguAsianet News Telugu

త్వరలో బిడ్డకు స్వాగతం పలకనున్న సిద్ధూ మూస్ వాలా తల్లిదండ్రులు.. ?

దివంగత పంజాబీ సింగర్ సిద్దూ మూస్ వాలా తల్లిదండ్రులు తమ కుటుంబంలోకి వారసుడిని ఆహ్వానించనున్నారు. మూస్ వాలా తల్లి గర్బవతి అని, ఆమె త్వరలోనే బిడ్డకు జన్మనివ్వతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి.

Sidhu Moosewala's parents to welcome their baby soon ?..ISR
Author
First Published Feb 27, 2024, 3:42 PM IST | Last Updated Feb 27, 2024, 3:42 PM IST

పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా తల్లిదండ్రులు తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తిని తీసుకురాబోతున్నారు. 58 ఏళ్ల తల్లి చరణ్ కౌర్, 60 ఏళ్ల బల్కౌర్ సింగ్ దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. చరణ్ కౌర్ గర్భవతిగా ఉందని, ఆమె త్వరలోనే బిడ్డను కనబోతోందని ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనం పేర్కొంది. అయితే ఈ విషయంలో మూస్ వాలా తల్లిదండ్రులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయిన మూస్ వాలా అదే ఏడాది మే 29న దారుణ హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో 2022 మే 29న కారులో వచ్చిన దుండగులు ఆయనను కాల్చి చంపారు. సిద్దూ మూస్ వాలాకు పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉంది. ముఖ్యంత యువతకు ఆయనంటే ఎంతో క్రేజ్ ఉంది.

మౌస్ వాలా సొంతంగా పాటలను కంపోజ్ చేయడంతో పాటు వాటిని నిర్మిస్తూ విడుదల చేసేవారు. ఆయన సంపన్న పంజాబీ గాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. మూస్ వాలా హత్యకు గురైన తరువాత విడుదలైన పాటలు కూడా లక్షల్లో వ్యూస్ సాధించాయి. కాగా.. 2022 మేలో పంజాబ్లోని మాన్సాలో కొందరు దుండగులు సింగర్ ను కాల్చి చంపారు. వెంటనే ఆయనను హాస్పిటల్ కు తరలించినప్పటికీ.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మూస్ వాలా హత్య జరిగినప్పటి నుంచి తల్లిదండ్రులు తమ కుమారుడికి న్యాయం చేయాలంటూ ఉద్యమం చేస్తున్నారు. తన చివరి పాటకు సంబంధించిన మ్యూజిక్ వీడియోలో 'జస్టిస్ ఫర్ సిద్ధూ మూస్ వాలా' అనే సందేశంతో కూడిన జెండాను ప్రముఖంగా ప్రదర్శించారు. ఈ పాట లిరిక్స్ లో తన విలక్షణమైన శైలిని ప్రదర్శించి, అందులో తన గురించి చెప్పారు.  కాగా.. 2017 లో సిద్ధూ మూస్ వాలా తన మొదటి పాట "జి వాగన్" తో సంగీత పరిశ్రమలోకి ప్రవేశించారు. వరుస ప్రజాదరణ పొందిన ఆల్బమ్ లతో వేగంగా ఫేమస్ అయ్యారు. "లెజెండ్", "సో హై", "ది లాస్ట్ రైడ్" వంటి హిట్లు ఆయన ఖాతాలో వేసుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios