నాగర్ కర్నూల్ ఎంపీ టిక్కెట్టు:మల్లు రవి, సంపత్ మధ్య పోటా పోటీ...
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేతల మధ్య పోటీ నెలకొంది.
హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీలో నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుండి పోటీ చేసేందుకు నేతలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుండి పోటీకి మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మల్లు రవిని ప్రభుత్వం నియమించింది. అయితే ఇటీవలనే ఈ పదవికి మల్లు రవి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని సీఎంకు అందించినట్టుగా ఆయన మీడియాకు తెలిపారు.
also read:తెలంగాణ నుండి పోటీకి సోనియా నిరాకరణ, తెరపైకి రాహుల్: ఆ మూడు స్థానాలపై ఫోకస్
నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్టుగా ఆయన చెప్పారు.మరో వైపు గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలంపూర్ అసెంబ్లీ స్థానం నుండి సంపత్ కుమార్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అయితే నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని సంపత్ కుమార్ ప్రయత్నాలను ప్రారంభించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో మల్లు రవి, సంపత్ కుమార్ కు చెందిన ఫ్లెక్సీలు పోటా పోటీగా వెలిశాయి.
also read:కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిక: రోగి పొట్టలో నుండి 39 నాణెలు, 27 ఆయస్కాంతాలు వెలికితీత
నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మల్లు రవి ప్రాతినిథ్యం వహించాడు. అంతకు ముందు మల్లు రవి సోదరుడు మల్లు అనంతరాములు కూడ ఇదే స్థానం నుండి ప్రాతినిథ్యం వహించాడు. మల్లు అనంతరాములు మరణించిన తర్వాత మల్లు రవి ఈ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించారు. జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుండి కూడ మల్లు రవి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.
also read:రేషన్ కార్డుంటేనే రూ. 500లకు గ్యాస్ సిలిండర్: నిబంధనలు ఇవీ..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దరిమిలా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ నేతలు కూడ ఆసక్తిని చూపుతున్నారు. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీకి 309 మంది ధరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి వంశీచంద్ రెడ్డి పోటీ చేస్తారని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.మిగిలిన 16 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుంది