Asianet News TeluguAsianet News Telugu

Today's Top Stories:నేడే టీడీపీ-జనసేన తొలి జాబితా?.. ఏపీలో కొత్త కూటమి..! అసోంలో ముస్లిం వివాహ చట్టం రద్దు..

Today's Top Stories: శుభోదయం..  ఈ రోజు ఏషియానెట్‌ టాప్ స్టోరీస్ లో  బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. నేడే టీడీపీ-జనసేన తొలి జాబితా?,ఏపీలో కొత్త కూటమి.. షర్మిలతో లెఫ్ట్ నేతల భేటీ..  వెంటాడిన వరుస ప్రమాదాలు.. మూడో సారి మృత్యుఒడిలోకి ఎమ్మెల్యే లాస్య నందిత..,  ప్రియాంక చేతుల మీదుగా  రెండు గ్యారంటీల ప్రారంభం, లిక్కర్ కేసులో కవితకు షాక్.  ముస్లిం వివాహ చట్టం రద్దు.. అసోం సంచలన నిర్ణయం.., పేటీఎం విజ్ఞప్తిని ఆర్బీఐ మన్నించినట్టేనా? ఆర్బీఐ ఆదేశాలివే, నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్సర్‌తో ముంబై విజయం.. వంటి వార్తల సమాహారం. 

Today top stories, top 10 Telugu news, latest Telugu news, online news, breaking news, Andhra Pradesh, Telangana February 24th, headlines KRJ
Author
First Published Feb 24, 2024, 7:30 AM IST

Today's Top Stories: ( పూర్తి వార్త కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి)

నేడే టీడీపీ-జనసేన తొలి జాబితా?

TDP-Janasena: ఏపీలో టీడీపీ, జనసేన కూటమి కసరత్తులో ముందడుగు పడింది. రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీతో చాలా మందికి అనుమానాలు తొలగిపోయాయి. బీజేపీ నుంచి ఇంకా సస్పెన్స్ ఉన్నప్పటికీ టీడీపీ, జనసేనల మధ్య ఒక స్పష్టమైన అవగాహన ఉన్నట్టు తేలిపోయింది. ఉమ్మడి మ్యానిఫెస్టోపై కసరత్తు జరుగుతున్నది. 28న తాడేపల్లి గూడెంలో ఉమ్మడిగా బహిరంగ సభను నిర్వహిస్తామని ఇది వరకే ప్రకటించారు. ఇక సీట్ల సర్దుబాట్లపైనా పలుమార్లు భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక కూడా వేగంగా జరుగుతున్నది. శనివారం మధ్యాహ్నం ఈ రెండు పార్టీల అభ్యర్థుల తొలి ఉమ్మడి జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నది.


ఏపీలో కొత్త కూటమి.. షర్మిలతో లెఫ్ట్ నేతల భేటీ.. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మరో కూటమి తెరమీదికి రానుంది.  ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం)లు  కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ మూడు పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో  ఈ మూడు పార్టీలు కూటమిగా పోటీ చేసేందుకుగాను  సన్నాహలు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైన ఓట్లు, సీట్లు దక్కించుకోవాలని  కాంగ్రెస్ పార్టీ వ్యూహలు రచిస్తుంది.ఈ క్రమంలోనే సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు శుక్రవారం నాడు  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలతో సమావేశమయ్యారు.  మూడు పార్టీలు రాష్ట్రంలో   కలిసి పోటీ చేసే విషయమై చర్చించారు. రాష్ట్రంలో మూడు పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేసే విషయమై చర్చించారు.  ఈ రెండు పార్టీల నేతలతో  వై.ఎస్. షర్మిల విడివిడిగా చర్చించారు. 

వైసీపీకి రాజీనామా చేస్తా..

MP Raghu Rama: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీకి గుడ్ బై చెబుతానని వివరించారు. వైసీపీకి రాజీనామా చేయడానికి ముహూర్తం నిర్ణయం చేసుకున్నట్టు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో తాను రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. అంతేకాదు, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని వివరించారు. విపక్ష కూటమి నుంచి తాను లోక్ సభ ఎన్నికల బరిలో నిలబడుతున్నట్టు ఎంపీ రఘురామ వెల్లడించారు. ఏ పార్టీ టికెట్ పై బరిలోకి దిగుతారనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. మొత్తానికి ప్రతిపక్ష శిబిరం నుంచి పోటీ చేస్తానని వివరించారు. అంతేకాదు, ఈ నెల 28వ తేదీన టీడీపీ, జనసేన సంయుక్తంగా నిర్వహించతలపెట్టిన ఉమ్మడి భారీ బహిరంగ సభలోనూ తాను పాల్గొంటానని వెల్లడించారు.

వెంటాడిన వరుస ప్రమాదాలు.. మూడో సారి మృత్యుఒడిలోకి ఎమ్మెల్యే లాస్య నందిత.. 

MLA Lasya Nanditha: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో శుక్రవారం ఉదయం మృతి చెందారు. పటాన్‌చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు లారీని తప్పించబోయి.. అదుపుతప్పి రోడ్డు పక్కన డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె  స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయగా.. డ్రైవర్ కు తీవ్రగాయ్యాలయ్యాయి. అయితే ఆమె ఇటీవల వరుసగా ప్రమాదాలకు గురైనట్టు తెలుస్తోంది. మృత్యువు వెంటాడుతోందా అన్నట్లుగా వరుసగా ప్రమాదాల బారిన పడింది.


ప్రియాంక చేతుల మీదుగా  రెండు గ్యారంటీల ప్రారంభం. 

Priyanka Gandhi Telangana Tour: తెలంగాణలో మరో రెండు గ్యారెంటీల అమలుకు డేట్ ఫిక్స్ చేసింది రేవంత్ సర్కార్. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,  200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ఈ నెల 27 (సోమవారం) నుంచి ప్రియాంక గాంధీ చేతులు మీదుగా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 

Delhi Liquor Scam: లిక్కర్ కేసులో కవితకు షాక్.  

ఆమ్ ఆద్మీ పార్టీని దారుణంగా దెబ్బ తీసిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తెర మీదికి వచ్చింది. ఇప్పటి వరకు ఆమె ఈడీ ముందు కేవలం సమాచారం కోసం విచారణ హాజరయ్యారు. కానీ, ఇప్పుడు ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ కేసులో ఆమె పేరును సీబీఐ చేర్చింది. ఈ మేరకు ఆమెకు సీబీఐ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన ఆమె ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.


ముస్లిం వివాహ చట్టం రద్దు.. అసోం సంచలన నిర్ణయం.. 

Assam: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నాడు సీఎం హిమంత బిశ్వ శర్మ అధ్యక్షతన సమావేశమైన ఆ రాష్ట్ర మంత్రివర్గం .. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) చట్టాన్ని తీసుకరావాలనే దిశగా ముస్లిం వివాహ, విడాకుల నమోదు చట్టం 1935ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. 

పేటీఎం విజ్ఞప్తిని ఆర్బీఐ మన్నించినట్టేనా? ఆర్బీఐ ఆదేశాలివే

Paytm: యూపీఐ ఆపరేషన్లు కొనసాగించడానికి అనుమతించాలని పేటీఎం సంస్థ కేంద్ర బ్యాంకు ఆర్బీఐని విజ్ఞప్తి చేసింది. పేటీఎం విజ్ఞప్తిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌(టీపీఏపీ)గా తమకు అవకాశం ఇవ్వాలని పేటీఎం రిక్వెస్ట్ చేసింది. ఈ విజ్ఞప్తిని పరిశీలించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఆర్బీఐ ఆదేశించింది. తాము టీపీఏపీగా మారడానికి అవకాశం ఇవ్వాలని, యూపీఐ ఆపరేషన్లు కొనసాగించే అనుమతి ఇవ్వాలని పేటీఎం.. ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిపై ఆర్బీఐ స్పందించింది.


WPL 2024: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్సర్‌తో ముంబై విజయం..

DC vs MI: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముంబై విజయం కోసం యాస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతంగా రాణించారు. అలాగే.. ఆఖరి బంతికి సజ్నా సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించింది.


ఎలోన్ మస్క్ సంచలన నిర్ణయం
 

స్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk). ఆయన నిర్ణయాలు ఎప్పుడూ సంచలనలే. ఇటీవల ట్విట్టర్ కొనుగోలు చేసి, దానిని ఎక్స్‌(X)గా  మార్చేసిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు వినియోగించే గూగుల్ జీమెయిల్‌ (Google Gmail) కు పోటీగా ఎక్స్ మెయిల్ (X-Mail) తీసుకొస్తామని, అది కూడా త్వరలో అందుబాటులోకి వస్తోందని కీలక ప్రకటన చేశారు. రాబోయే Xmail గురించి ఎక్కువ సమాచారం ఇవ్వలేదు. కానీ జీమెయిల్‌లో కనిపించని అనేక ఫీచర్లు ఇందులో తీసుకోస్తారని భావిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios