Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కూటమి: షర్మిలతో లెఫ్ట్ నేతల భేటీ, సీట్ల సర్దుబాటుపై చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మరో కూటమి తెరమీదికి రానుంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు  కూటమిగా పోటీ చేసే అవకాశం ఉంది. 

 CPI and CPI(M) Leaders Meeting with Y.S. Sharmila for seats sharing
Author
First Published Feb 23, 2024, 11:31 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం)లు  కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ మూడు పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

దీంతో  ఈ మూడు పార్టీలు కూటమిగా పోటీ చేసేందుకుగాను  సన్నాహలు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైన ఓట్లు, సీట్లు దక్కించుకోవాలని  కాంగ్రెస్ పార్టీ వ్యూహలు రచిస్తుంది.ఈ క్రమంలోనే సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు శుక్రవారం నాడు  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలతో సమావేశమయ్యారు.  మూడు పార్టీలు రాష్ట్రంలో   కలిసి పోటీ చేసే విషయమై చర్చించారు. రాష్ట్రంలో మూడు పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేసే విషయమై చర్చించారు.  ఈ రెండు పార్టీల నేతలతో  వై.ఎస్. షర్మిల విడివిడిగా చర్చించారు. 

also read:రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి: అతి వేగమే కారణమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి  ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.  మార్చి మొదటి లేదా రెండో వారంలో   ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది.  దీంతో  లెఫ్ట్ పార్టీలతో సీట్ల సర్దుబాటు,  ఎన్నికల మేనిఫెస్టోపై  మూడు పార్టీల నేతలు చర్చించారు.

also rad:అచ్చిరాని ఫిబ్రవరి: తండ్రి మరణించిన ఏడాదికే లాస్య నందిత మృతి

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేయనున్నట్టుగా ప్రకటించాయి.ఈ కూటమిలో బీజేపీ కూడ చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై  బీజేపీ నాయకత్వం  స్పష్టత ఇవ్వాల్సి ఉంది.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే. పీ. నడ్డా,  కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ పరిణామం  టీడీపీ ఎన్‌డీఏలో చేరే అవకాశం ఉందనే  ప్రచారానికి ఊతమిచ్చినట్టైంది.

also read:వై.ఎస్. షర్మిల ఆందోళన: ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2004 ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆనాడు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ ఓటమి పాలైంది. అప్పట్లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా  బాధ్యతలు నిర్వహించారు.  2009 ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. ఈ ఎన్నికల సమయంలో  లెఫ్ట్ పార్టీలు, బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో  మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios