WPL 2024: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్సర్‌తో ముంబై విజయం..

DC vs MI: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముంబై విజయం కోసం యాస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతంగా రాణించారు. అలాగే.. ఆఖరి బంతికి సజ్నా సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించింది.

MI vs DC WPL 2024 Highlights Mumbai Indians Beat Delhi Capitals by 4 Wickets  KRJ

WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఓపెనింగ్ ఫెస్టివల్ కు   మహిళా క్రికెటర్లను ఉత్సాహపరించేందుకు బాలీవుడ్ స్టార్స్ తరలివచ్చారు. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, షాహిద్ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రా, కార్తిక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ స్టెపులతో చిన్నస్వామి స్టేడియం హోరెత్తిపోయింది.

ఇలా జోష్ గా ప్రారంభమైన ఈ సీజన్ ఆరంభం కూడా అదిరింది. ఢిఫెండింగ్ ఛాంపియన్స్ బరిలో దిగిన ముంబయి ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించి.. బోణీ కొట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో ముంబై చివరి బంతికి సిక్సర్ బాదడంతో నాలుగు వికెట్లతో విజయం సాధించింది. మొత్తానికి సీజన్ ప్రారంభంలోనే బోణీ కొట్టిన ముంబయి చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. 

మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబయి తరుపున యస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్ రాణించారు. ముంబై విజయానికి వీరిద్దరి 56 పరుగుల భాగస్వామ్యం అందించారు. యాస్తిక 57 పరుగులతో విధ్వంసగా ఇన్నింగ్స్ ఆడి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించారు.

అలాగే.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తన సత్తా చాటారు. జట్టు విజయానికి 55 పరుగులు చేసి.. కీలక పాత్ర పోహించారు. నరాల తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ లో చివరి బంతి వరకు విజయం దోబుచులాట ఆడింది. చివరి ఓవర్ ఐదో బంతికి ముంబై క్రీడాకారిణీ ఎల్లిస్ క్యాప్సీ ఔటయ్యాడు. ఈ సమయంలో ముంబై విజయం సాధించాలంటే..  ఒక బంతికి ఐదు పరుగులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సమయంలో వచ్చిన సంజన మ్యాచ్ విన్నింగ్ సిక్స్ కొట్టి మొదటి మ్యాచ్‌లో జట్టుకు విజయాన్ని అందించారు. 

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఢిల్లీ తరఫున ఎల్లిస్ క్యాప్సీ 75 పరుగులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.  ఈ సమయంలో ఆమె 141.50 స్ట్రైక్ రేట్ తో 8 ఫోర్లు,3 సిక్సర్లు కొట్టింది.  అలాగే మరో బ్యాట్స్ మెన్  జెమిమా రోడ్రిగ్స్ 42 పరుగులు చేసింది. అయితే.. ఆమె  ఈ ఇన్నింగ్స్‌ను అర్ధ సెంచరీగా మార్చలేకపోయింది.మరోవైపు ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ 31 పరుగులు చేసింది.  అదే సమయంలో షెఫాలీ వర్మ ఒక పరుగు, మరిజన్ కాప్ 16 పరుగులు, అన్నాబెల్ సదర్లాండ్ 1 (నాటౌట్) స్కోరు చేశారు. ఢిల్లీపై ముంబై తరఫున నటాలీ సివర్ బ్రంట్, అమేలియా కెర్ రెండేసి వికెట్లు తీశారు.  
 
చివరి బంతి వరకు ఉత్కంఠపోరు. 

172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బయలుదేరిన ముంబై ఇండియన్స్ ఆరంభంలో తడబడింది. తొలి ఓవర్ రెండో బంతికే ఆ జట్టు తొలి వికెట్‌ పడింది. హీలీ మాథ్యూస్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టింది. ఆ తర్వాత యాస్తికా భాటియా ముంబై విక్టరీ భాద్యతలు తమపై వేసుకుంది. ఈ తరుణంలో 57 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించింది. ఢిల్లీపై నటాలీ సివర్ బ్రంట్ 19 పరుగులు, అమేలియా కెర్ 24 పరుగులు, పూజా వస్త్రాకర్ ఒక పరుగు చేశారు. అదే సమయంలో అమంజోత్ కౌర్ మూడు పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, సజీవన్ సజ్నా చివరి బంతికి సిక్స్ కొట్టి.. ముంబైకి విజయాన్ని అందించింది. ఢిల్లీ బౌలర్లలో అరుంధతి రెడ్డి, అలిస్ క్యాప్సీ రెండేసి వికెట్లు తీశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios