భారత్ ను హిందూ రాజ్యంగా మార్చాల్సిన అవసరమే లేదు - ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే
Dattatreya Hosabale : భారత్ ను హిందూ రాజ్యంగా మార్చాల్సిన అవసరమే లేదని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే అన్నారు. భారత్ ఎప్పుడు హిందూ దేశంగా మారుతుందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ హోసబలే ఈ వ్యాఖ్యలు చేశారు.
Dattatreya Hosabale : గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని భుజ్ లో నిర్వహించిన సంఘ్ అఖిల భారత కార్యవర్గ సమావేశం మంగళవారం చివరి రోజుకు చేరుకుంది. ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే హాజరై ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాల్సిన అవసరం లేదని అన్నారు. దీనిని సంఘ్ విశ్వసిస్తుందని తెలిపారు. ఎందుకంటే దేశం ఎప్పుడూ ఒక్కటే అని చెప్పారు.
భారతదేశం ఇప్పటికే హిందూ దేశంగా ఉందని, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుందని దత్తాత్రేయ హోసబలే స్పష్టం చేశారు. డాక్టర్ హెడ్గేవార్ (ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు) ఈ దేశంలో హిందువు ఉన్నంత కాలం ఈ దేశం హిందూ దేశమని చెప్పారని గుర్తు చేశారు. రాజ్యాంగం భిన్నమైన రాజ్య వ్యవస్థ గురించి చెబుతుందని అన్నారు. ‘‘ఒక దేశంగా భారతదేశం ఉంది. భారతదేశం హిందూ దేశంగా మిగిలిపోతుంది’’ అని ఆయన తెలిపారు.
విమానంపై నుంచి పడి ఎయిరిండియా ఇంజినీర్ మృతి.. అసలేం జరిగిందంటే ?
భారత్ ఎప్పుడు హిందూ దేశంగా మారుతుందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ హోసబలే ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ఐక్యతను కాపాడుకోవడం, సమాజ శ్రేయస్సు కోసం కొంత సమయం వెచ్చించడం హిందుత్వమని ఆయన అన్నారు. భారతదేశం హిందూ దేశమని ప్రజలకు అర్థమయ్యేలా చేసే పనిని ఆర్ఎస్ఎస్ చేస్తుందన్నారు. అందువల్ల భారతదేశం ఇప్పటికే ఒకటే కాబట్టి హిందూ రాష్ట్రాన్ని స్థాపించాల్సిన అవసరం లేదని, దానినే ఆర్ఎస్ఎస్ నమ్ముతోందన్నారు.
ఎన్నికల ప్రచారంలో హెంమంత్రి అమిత్ షాకు ప్రమాదం...
దేశం ముందున్న ప్రధాన సవాళ్లలో నార్త్ వర్సెస్ సౌత్ ఒకటని అన్నారు. ప్రాంత ప్రతిపదికన విభజించే కుట్ర ఇది అని అన్నారు. దక్షిణ భారతదేశం వేరు, ఉత్తర భారతదేశం వేరు అని కొందరు ఇప్పుడు చెబుతున్నారని అన్నారు. తాము ద్రావిడులమని, వారి భాష కూడా వేరు అని చెప్పుకుంటూ దక్షిణాదిని (భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి) విడదీయడానికి రాజకీయ, మేధో స్థాయిలో కుట్ర జరుగుతోందని తెలిపారు. ఇది దేశాన్ని బలహీనపరిచే ఎత్తుగడ అని చెప్పారు. దీనిని వ్యతిరేకించడానికి ప్రజలు ముందుకు రావాలని, అలాంటి వారు విజయం సాధించకుండా చూడాలని అన్నారు.