ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి అమిత్ షాకు ప్రమాదం...

ప్రచార వాహనానికి విద్యుత్ వైర్లు తాకడంతో తెగిపోయాయి. వెంటనే అప్రమత్తం కాకపోతే పెను ప్రమాదం సంభవించేది. 

Home Minister Amit Shah met with an accident during election campaign in rajasthan - bsb

రాజస్థాన్ : బిజెపి అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు  మంగళవారం పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్ లోని నాగూర్లో రోడ్ షో నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న  ప్రచార వాహనానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. అది చుట్టుపక్కల ఉన్న బిజెపి నేతలు వెంటనే గమనించి అప్రమత్తమయ్యారు.

అమిత్ షా వాహనం వెనుక ఉన్న వేరే వాహనాలను అప్రమత్తం చేయడంతో…వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో హోం మంత్రి అమిత్ షా తో పాటు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. హోం మంత్రి అమిత్ షా రాజస్థాన్లో ఎన్నికల సభలో పాల్గొనేందుకు బిరియాడి గ్రామం నుంచి సర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

అమిత్ షా ప్రమాద ఘటన మీద రాజస్థాన్ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ వెంటనే స్పందించారు. అమిత్ షాకు ప్రమాదం తప్పిపోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లుగా తెలిపారు. రోడ్డుకి ఇరువైపులా ఇళ్లు, దుకాణాలు ఉన్న వీధుల్లో ర్యాలీ నిర్వహించారు దీంతోనే కరెంటు వైర్లు వాహనానికి తగిలి ఉంటాయని అనుమానిస్తున్నారు. మరో వైపు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వెలుగు చూసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios