విమానంపై నుంచి పడి ఎయిరిండియా ఇంజినీర్ మృతి.. అసలేం జరిగిందంటే ?
విమానం పై నుంచి పడి ఇంజనీర్ మరణించారు. ఈ ఘటన ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మంగళవారం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగిన ప్రమాదంలో ఓ ఇంజనీర్ మరణించారు. ఎయిరిండియా (ఏఐ) విమానం మెయింటెనెన్స్ పనులు చేస్తున్న సమయంలో ఎయిరిండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్) సీనియర్ సూపరింటెండెంట్ సర్వీస్ ఇంజనీర్ (56) విమానం రాడోమ్ నుంచి పడి మరణించారు. మృతుడిని రామ్ ప్రకాశ్ సింగ్ గా పోలీసులు గుర్తించారు.
బాలయ్య, డైరెక్టర్ బాబీ మూవీ షూటింగ్ మొదలు.. బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్, బాబోయ్ ఏంటా డైలాగులు
మృతుడు ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ లో సర్వీస్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడని, నవంబర్ 6-7 తేదీల మధ్య రాత్రి ఐజీఐ ఎయిర్ పోర్టు టెర్మినల్ 3 (టీ-3)లో నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్నాడని విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. మెయింటెనెన్స్ సమయంలో మెట్లపై నుంచి జారిపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు.
వెంటనే ఆయనను మేదాంత హాస్పిటల్ కు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఆయనను మణిపాల్ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అయితే అక్కడికి వెళ్లేలోపే పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని క్రైమ్ టీం, ఫోరెన్సిక్ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.