Asianet News TeluguAsianet News Telugu

Mahmoud Abbas : పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ పై హత్యాయత్నం.. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు మృతి..

Mahmoud Abbas : పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ కాన్వాయ్ పై దుండుగులు దాడి చేశారు. ఆయనను హతమార్చేందుకు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో అబ్బాస్ సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు మరణించారు. ఈ దాడికి అబూ జందాల్ సన్స్ బాధ్యత వహించింది. 
 

Mahmoud Abbas: Assassination attempt on Palestinian President Mahmoud Abbas.. Security guard killed in firing..ISR
Author
First Published Nov 8, 2023, 10:02 AM IST

Israel-Palestine War: గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ (Palestinian President Mahmoud Abbas)పై హత్యాయత్నం జరిగింది. దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో అబ్బాస్ భద్రతా సిబ్బంది హతమయ్యారు. ఇజ్రాయెల్ పై 'ప్రపంచ యుద్ధం' ప్రకటించాలని కోరుతూ పాలస్తీనా నేతకు 'సన్స్ ఆఫ్ అబూ జందాల్' అనే బృందం 24 గంటల అల్టిమేటం జారీ చేసిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. 

అమిత్ షాకు తృటిలో తప్పిన ప్రమాదం..

గడువు ముగుస్తుండటంతో అధ్యక్షుడి కాన్వాయ్ పై కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడికి తామే బాధ్యులమని అబూ జందాల్ సన్స్ పేర్కొంది. అయితే హత్యాయత్నంపై పాలస్తీనా నేషనల్ అథారిటీ (పీఎన్ఏ) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
 

కాగా.. ఈ ఘటన జరిగిన రోజే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ను సందర్శించారు. గాజా సంఘర్షణ అనంతర భవిష్యత్తులో పాలస్తీనియన్లు ఒక గొంతుకను కలిగి ఉండాలని ఆయన నొక్కిచెప్పారు. గాజా పౌర జనాభాకు సహాయం చేయడానికి బైడెన్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అధ్యక్షుడు అబ్బాస్ కు హామీ ఇచ్చారు. అయితే  బ్లింకెన్ పర్యటిస్తున్న రోజున గాజాలోని రెండు శరణార్థుల శిబిరాలపై ఇజ్రాయెల్ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో 53 మంది మరణించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios