స్కూల్ కు వెళ్తున్న మైనర్ బాలికను ఓ యువకుడు ఐటమ్ అని కామెంట్ చేశాడు. ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. నిందితుడు లైంగిక ఉద్దేశంతోనే బాలికపై అలాంటి కామెంట్ చేశాడని నిర్ధారించి ఏడాదిన్నర జైలు శిక్షను విధించింది.
ఓ బాలికను ‘ఐటెమ్’ అని కామెంట్ చేసినందుకు ఓ యువకుడికి 1.5 నెలల జైలు శిక్ష పడింది. అలాంటి పదాన్ని బాలికను లైంగికంగా అభివర్ణించడానికి మాత్రమే ఉపయోగించారని భావించిన పోక్సో కోర్టు 25 ఏళ్ల వ్యా పారవేత్తను దోషిగా నిర్ధారించింది. శిక్షను ఖరారు చేసింది.
ఉదయం 11.30 గంటలలోపు రాజీనామా చేయండి.. 9 యూనివర్సిటీల వీసీలను కోరిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్..
వివరాలు ఇలా ఉన్నాయి. ముంబాయికి చెందిన 16 ఏళ్ల బాలిక 2015 సంవత్సరం జూలై 14వ తేదీన మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తోంది. ఈ సమయంలో ఓ పాతికేళ్ల యువకుడు స్నేహితులతో కలిసి ఓ బైక్ పై కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో బాలిక వారి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్లింది. దీంతో ఆ గ్యాంగ్ ఆమెను వెంబడించింది. అందులో నిందితుడు బాలిక జుట్టును పట్టుకొని లాగాడు. ‘‘క్యా ఐటెమ్ కిధార్ జా రహీహో?’’ (ఏ ఐటెమ్.. ఎక్కడికి వెళ్తున్నావ్) అని సంభోదించాడు. దీంతో ఆ యువతి కోపగించుకుంది.
దేశంలో విద్వేషాలు నింపుతున్న బీజేపీ, ఆరెస్సెస్.. : రాహుల్ గాంధీ
అలా చేయొద్దని అతడిని తోసేసింది. దీంతో నిందితుడు బాలికను దుర్భాషలాడడం ప్రారంభించాడు. తన ఇష్టమున్నది చేస్తానని బెదిరించాడు. దీంతో వెంటనే మైనర్ బాలిక 100కి డయల్ చేసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని బాలిక తన తండ్రికి తెలిపింది.
సిత్రాంగ్ తుఫాన్: ఏపీకి తప్పిన ముప్పు.. ఈశాన్య రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం.. తీరం దాటేది ఎక్కడంటే..
ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడికి ముందస్తు బెయిల్ లభించింది. బాలిక తల్లిదండ్రులు కావాలనే తప్పుడు కేసులు బనాయించారని నిందితుడి తరపు న్యాయవాది వాదించారు. అప్పటి నుంచి పలు విడతలుగా విచారణ సాగింది. చివరికి నిందితుడు కావాలనే నెల రోజుల పాటు ‘‘లైంగిక ఉద్దేశ్యం’’తో ఆమెను అనుసరిస్తున్నస్తుట్లు కోర్టు గుర్తించింది. ఈ ఘటనలో అనుచితమైన ఉదాసీనతతో నిందితుడిని విడిచిపెట్టడాట్టనికి నిరాకరించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎస్జె అన్సారీ.. ‘‘ ఇలాంటి నేరాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాంటి రోడ్డు పక్కన రోమియోలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. బాలిక జుట్టు లాగి ఆ వ్యాపారవేత్త జుట్టును లాగి, దుర్భా షలాడాడు. అతడు కోరుకున్నది చేయగలనని అన్నాడు’’ అని అన్నారు. అనంతరం ఏడాదిన్నర శిక్షను ఖరారు చేస్తూ న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు.
