ఓ కుమారుడు మానసిక ఆందోళనతో నిద్ర పోతున్న తల్లిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం తండ్రికి లేఖ రాసి తనను క్షమించాలని కోరాడు. తరువాత అతడూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. 

ఆ త‌ల్లిదండ్రుల‌కు కుమారుడంటే ప్రాణం. ఆ పిల్లాడు క‌ళ్ల ముందే ఎదుగుతుంటే ఎంతో సంబ‌ర‌ప‌డ్డారు. క‌ష్ట‌ప‌డి చ‌దించారు. కానీ కొంత కాలం నుంచి ఆ కుమారుడు మానసిక కృంగుబాటుతో బాధ‌ప‌డుతున్నాడు. అయిన‌ప్పటికీ అత‌డిని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటూ వ‌స్తున్నారు. అయితే ఒక రోజు రాత్రి నిద్ర‌లో నుంచి ఒక్క సారిగా లేచి త‌ల్లిని చంపేశాడు. అనంత‌రం తండ్రికి లేఖ రాసి బాధ‌ప‌డ్డాడు. త‌రువాత ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. 

India Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులంటే..

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. గుజారాత్ రాష్ట్రానికి చెందిన మ‌హేష్ పంచ‌ల్ త‌న కుటుంబంతో క‌లిసి మ‌హారాష్ట్రలో ఉంటున్నారు. వారి కుటుంబం మొత్తం వ‌ర్ధ‌మాన్ న‌గ‌ర్ లో సెటిల్ అయ్యింది. ఇద్ద‌రు దంప‌తులు, వారి కుమారుడు ఒకే ఇంట్లో క‌లిసి ఉంటున్నారు. కుమారుడి పేరు జ‌యేష్ పంచ‌ల్. 22 ఏళ్ల వ‌యస్సు. ఇంజ‌నీరింగ్ పూర్తి చేశాడు. అయితే కొంత కాలం నుంచి మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నాడు. రాత్రి నిద్రలో నుంచి లేచేవాడు. ఉలిక్కిప‌డేవాడు. కొంత కాలం త‌రువాత విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం ప్రారంభించాడు. 

అయిన‌ప్ప‌టికీ త‌ల్లి ఛాయా పంచ‌ల్ త‌న కుమారుడు జ‌యేష్ పంచ‌ల్ ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటోంది. కొంత కాలం నుంచి ఒక్క సారిగా మ‌ళ్లీ ప్ర‌వ‌ర్త‌న మారింది. త‌న‌కు ఆస్తిలో వాటా కావాల‌ని కోరడం, డ‌బ్బులు అడ‌గడం, లొల్లి చేయ‌డం వంటివి మొద‌లు పెట్టారు. కానీ త‌ల్లి ఓపిక‌తో ఉంటూ వ‌స్తోంది. అయితే గ‌త శ‌నివారం ఇంట్లో తల్లీ కుమారుడు నిద్ర పోతున్నారు. ఈ క్ర‌మంలో జ‌యేష్ పంచ‌ల్ నిద్రలో నుంచి లేచి.. నిద్రిస్తున్న త‌ల్లిని క‌త్తితో దారుణంగా చంపేశాడు. 

వామ్మో.. 27 మందితో ఆటో.. ఏడు మందితో బైక్ ప్ర‌యాణం.. నెట్టింట వైర‌ల్ !

కొంత స‌మ‌యం త‌రువాత తేలుకొని చేసిన త‌ప్పును తెలుసుకున్నాడు. దీంతో ప‌శ్చాత్తాపానికి గుర‌య్యాడు. అనంత‌రం తండ్రికి లేఖ రాశాడు. ‘‘ నాన్న న‌న్ను క్షమించు. అమ్మను నేనే చంపేశాను. లవ్ యూ ’’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. అనంతరం దానిని ఇంట్లోనే పెట్టి బయటకు వెళ్లిపోయాడు. ద‌గ్గ‌ర‌లో ఉన్న రైల్వే స్టేష‌న్ కు చేరుకున్నాడు. ఎదురుగా వ‌చ్చిన‌ లోక‌ల్ ట్రైన్ కింద సూసైడ్ చేసుకోవాల‌ని అనుకున్నాడు. ఈ క్ర‌మంలో దాని కింద ప‌డినా..తీవ్ర గాయాల‌తో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. దీంతో స్థానికులు అత‌డిని హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. అయితే తల్లిని ఎందుకు చంపాడో అస‌లు కార‌ణం ఏంట‌నే విష‌యం తెలియాలంటే జ‌యేష్ పూర్తిగా కోలుకోవాల్సి ఉంటుంది. ఈ ఘ‌ట‌న తెలుసుకున్న తండ్రి తీవ్రంగా విల‌పించ‌డం అక్క‌డున్న వారిని కంట‌త‌డి పెట్టించింది. 

గుడ్ న్యూస్.. ఇక దోమ‌ల బెడ‌దకు చెక్.. కొత్త టెక్నాల‌జీని డెవ‌లప్ చేసిన ఐసీఎంఆర్

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే 9152987821 అనే ప్ర‌భుత్వ హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు.