Viral News: ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన రెండు ఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక ఆటోలో ఏకంగా 27 మంది.. మరో బైక్ పై ఏడుగురు అత్యంత ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్న ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.
Uttar Pradesh: రోడ్డు ప్రమాదాల గురించి నిత్యం పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. పలు ఘటనలకు సంబంధించిన వీడియోలను సైతం పంచుకుంటూ రోడ్ ప్రయాణం పై అవగాహన కల్పిస్తున్నారు. అయితే, అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న కొందరు ఈ నిబంధనలు పాటించకుండా ప్రాణాలు తీస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన రెండు ఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక ఆటోలో ఏకంగా 27 మంది.. మరో బైక్ పై ఏడుగురు అత్యంత ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్న ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఒక ఆటు రోడ్డుపై రైయ్ రైయ్ మంటూ దూసుకెళ్తోంది. ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న ఆ ఆటో ను గుర్తించిన పోలీసులు గుర్తించి.. ప్రయాణికులను ఇందులో నుంచి కిందకు దించారు. ఆ చిన్న త్రీవీలర్‌లో డ్రైవర్‌తో సహా మొత్తం 27 మంది ప్రయాణిస్తున్నట్లు గుర్తించిన పోలీసు అధికారులు ఆశ్చర్యపోయారు. ట్రాఫిక్ పోలీసులు అతివేగంగా వచ్చిన ఆటోను వెంబడించారు. ఆటో ఆపివేయబడిన తర్వాత, పోలీసులు ప్రయాణీకులను దించారు. అందులో నుంచి వృద్ధులు, పెద్దలు, పిల్లలతో సహా 27 మంది ఇరుకైన వ్యక్తులు దిగడం చూసి ఆశ్చర్యపోయారు. ఆటో దిగుతున్న ప్రయాణికులను ఒక్కొక్కరిగా లెక్కిస్తున్న పోలీసులు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిల్లలు, పెద్దలు సహా మొత్తం 27 మంది ప్రయాణికులు బక్రీద్ ప్రార్థనలు చేసి తమ గ్రామానికి తిరిగి వస్తున్నారు. డ్రైవర్‌తో సహా నలుగురిని ఎక్కించుకునే ఆటోలో అంతకు రెండింతలు ఎక్కువ మందిని ఎక్కించుకుని ప్రమాదకరస్థాయిలో వెళ్తున్నారు.
ఈ దారుణమైన చర్య ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా పెద్ద రోడ్డు ప్రమాదానికి కూడా కారణమయ్యే అవకాశం ఉంది. పోలీసులు ఆటో డ్రైవర్‌ను తీవ్రంగా మందలించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జాతీయ మీడియా రిపోర్టుల ప్రకారం.. కుటుంబం ఈద్ జరుపుకోవడానికి బంధువుల ఇంటికి వెళుతుందని, మరో ఆటో దొరకలేదని, అందుకే వారందరినీ ఈ ఒక్క ఆటోలో తీసుకెళ్లడానికి అంగీకరించానని డ్రైవర్ తెలిపాడు.
ఒకే బైక్‌పై ఏడుగురు ప్రయాణం..
యూపీలో చోటుచేసుకున్న మరో ఘటన సైతం నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో త్రీవీలర్‌లో 27 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను అదుపులోకి తీసుకున్న పోలీసులకు.. ఒకే బైక్‌పై ఏడుగురు వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాదీనం చేసుకున్నారు. అత్యంత ప్రమాదకరంగా బైక్ నడిపే వ్యక్తి తప్ప మిగతావారందరూ చిన్నారులు కావడం గమనార్హం. బక్రీద్ తర్వాత పిల్లలకు ఐస్‌క్రీమ్ ఇప్పించేందుకు తాను వెళ్తున్నానని, వేరే రవాణా మార్గం లేదని ఆ వ్యక్తి చెప్పడం గమనార్హం.
