భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,615  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,36,52,944కి చేరింది.

భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,615 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,36,52,944కి చేరింది. తాజాగా కరోనాతో 20 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం డేటాను విడుదల చేసింది. తాజా మరణాలతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,25 474కి చేరుకుంది. ఇక, గత 24 గంటల్లో దేశంలో కరోనా నుంచి 13,265 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,29,96,427కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది. 

ఇక, దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,31,043గా ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య గత 24 గంటల వ్యవధిలో 330 కేసులు పెరిగింది. మొత్తం కరోనా కేసులలో యాక్టివ్ కేసులు.. 0.30 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక, ప్రస్తుతం దేశంలో రోజువారీ సానుకూలత రేటు 3.23 శాతంగా నమోదైంది. 

ఇక, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. దేశంలో సోమవారం 10,64,038 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,99,00,59,536కు చేరింది.

ఇక, భారతదేశంలో COVID-19 కేసుల సంఖ్య 2020 ఆగస్టు 7న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షల మార్క్‌ను దాటింది. ఇక, 2020 సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది. దేశం గత ఏడాది మే 4న రెండు కోట్లు, జూన్ 23న మూడు కోట్లు, ఈ ఏడాది జనవరి 25న నాలుగు కోట్ల మార్కును దాటింది.