సారాంశం
ఓ యువకుడు తన ప్రియురాలని కలుసుకునేందుకు గ్రామం మొత్తానికీ కరెంట్ కట్ చేసేవాడు. ఒక రోజు ఈ విషయం ఆ గ్రామస్తులకు తెలిసింది. ఆ ప్రేమ జంట ఒక్క దగ్గర సన్నిహితంగా కలిసి ఉండగా.. వారిని పట్టుకున్నారు. అనంతరం యువకుడిని చితకబాదారు.
రిలేషన్ షిప్ లో ఉన్న ఏ జంటకైనా తరుచూ కలుసుకోవాలని, మాట్లాడుకోవాలని ఉంటుంది. ఇలా కలిసినప్పుడు ఎవరికీ కనబడకుండా ఉండాలని ప్రయత్నిస్తారు. తరువాత ఎవరిదారిన వెళ్లిపోతారు. బీహార్ లోని ఓ జంట కూడా ఇలాగే కలుసుకోవాలని అనుకుంది. అయితే తాము ఎవరి కంటపడకుండా ఉండాలని ఆ ప్రేమికుడు ఊరు మొత్తానికీ కరెంట్ కట్ చేశాడు. తరువాత వారిద్దరూ సన్నిహితంగా ఉండి మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో గ్రామస్తులకు తెలియడంతో అతడిని చితకబాదారు.
ప్రధాని మోడీ అమెరికా పర్యటన.. 105 పురాతన వస్తువులను భారత్ కు అప్పగించిన యూఎస్
ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రం బెటియా జిల్లాలో నౌతాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలోని ఓ యువతి, సమీప గ్రామంలో ఉండే యువకుడు ప్రేమించుకుంటున్నారు. అయితే ఆమెను కలుసుకునేందుకు ఆ యువకుడు ఆ గ్రామంలోకి రాత్రి సమయంలో ప్రవేశించేవాడు. తమను ఎవరూ గమనించకూడదనే ఉద్దేశంతో ఊరు మొత్తానికీ కరెంట్ కట్ చేసేవాడు.
ఇలా తరచూ జరుగుతుండేది. ఎందుకు ఇలా తరచూ రెండు, మూడు గంటలు కరెంటు పోతోందని ఆ గ్రామస్తులు అయోమయంలో పడ్డారు. చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కరెంటు ఉండగా.. తమ గ్రామానికే ఎందుకు ఈ సమస్య వస్తుందోనని అర్థంకాక, ఏమీ చేయలేక అలాగే ఉండిపోయేవారు. అయితే తాజాగా మళ్లీ ఆ యువకుడు తన ప్రేయసిని కలుసుకునేందుకు గ్రామంలోకి ప్రవేశించాడు. ఎప్పటిలాగే కరెంట్ కట్ చేశాడు. అయితే ఈ సారి పలువురు గ్రామస్తులు అతడి చర్యలు గమనించారు.
‘యోగి, మోడీ ప్రభుత్వాలే టార్గెట్.. ముంబైలో 26/11 తరహా మరో దాడి’- పోలీసులకు అగంతకుడి బెదిరింపు కాల్
తమ గ్రామానికి తరచూ ఎదురవుతున్న కరెంటు సమస్య ఆ యువకుడు వల్లే అనే అర్థం చేసుకున్నారు. ఆ ప్రేమికుడు ఎప్పటిలాగే తన ప్రేయసిని కలుసుకున్నాడు. వారిద్దరూ సన్నిహితంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు అక్కడికి రావడంతో వారిద్దరూ షాక్ అయ్యారు. ఆ యువకుడిని చితకబాదడం మొదలుపెట్టారు. ఆ యువతి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీనిని పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో ఆ యువకుడిపై దాడి చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ ప్రేమ జంట కుటుంబాలు కలిసి కూర్చొని మాట్లాడుకున్నాయి. ఇద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. త్వరలోనే ఆ ప్రేమ జంట దంపతులు కాబోతున్నారు.