చెన్నై: కేరళలో చోటు చేసుకొన్న వరదల విషయంలో తమిళనాడు సర్కార్ ఘాటుగానే స్పందించింది. వరదలకు తాము కారణం కాదని తమిళనాడు సర్కార్ స్పష్టం చేసింది. కేరళలో వరదలకు ముళ్ల పెరియార్ డ్యామ్ నుండి నీటిని విడుదల చేయడమే కారణంగా వరదలు వచ్చాయని కేరళ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయిచిన విషయం తెలిసిందే.

కేరళ సర్కార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు  శుక్రవారం నాడు తమిళనాడు సర్కార్ కౌంటర్ దాఖలు చేసింది. ముళ్ల పెరియార్ డ్యామ్ వాస్తవానికి కేరళ భూభాగంలోనే ఉంది. కానీ ప్రాజెక్టు నిర్వహణ మాత్రం తమిళనాడు ప్రభుత్వం చేతిలో ఉంది.

అయితే కేరళ సర్కార్‌కు,తమిళనాడు సర్కార్‌కు మధ్య చాలా కాలంగా  ఈ విషయమై వివాదం సాగుతోంది. కేరళలో వరదలకు  ముళ్లపెరియార్  డ్యామ్ నుండి విడుదల చేసిన నీళ్లే కారణమని కేరళకు కౌంటర్‌గా తమిళనాడు సర్కార్ లెక్కలను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

ఆగష్టు 14 నుండి 19 వరకు రోజువారీగా ఎన్ని టీఎంసీల నీటిని విడుదల చేశారో  తమిళనాడు సర్కార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన  కౌంటర్ పిటిషన్ లో పేర్కొంది. ఆగష్టు 14 నుండి 19 వరకు కేవలం 36 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేసినట్టు తమిళనాడు సర్కార్ ప్రకటించింది.

ఈ వార్తలు చదవండి

వరదలపై కేరళ ప్రభుత్వం సంచలన ఆరోపణ

'గుజరాత్‌ భూకంపానికి విదేశీ సహాయం తీసుకొన్నారు, కేరళకు ఎందుకొద్దు'
 

కేరళకు కేంద్రం నుంచి రూ.600 కోట్లు: అంచనా తర్వాత మరింత