Asianet News TeluguAsianet News Telugu

'గుజరాత్‌ భూకంపానికి విదేశీ సహాయం తీసుకొన్నారు, కేరళకు ఎందుకొద్దు'

ఎన్డీఏ-1 అధికారంలో ఉన్న కాలంలో  గుజరాత్ రాష్ట్రంలో అప్పట్లో సంభవించిన  భూకంపానికి సంబంధించిన 60 దేశాల నుండి  ఆర్థిక సహాయాన్ని పొందింది. 

NDA-I took aid from 60 nations for Gujarat quake
Author
Kerala, First Published Aug 24, 2018, 12:12 PM IST


న్యూఢిల్లీ: ఎన్డీఏ-1 అధికారంలో ఉన్న కాలంలో  గుజరాత్ రాష్ట్రంలో అప్పట్లో సంభవించిన  భూకంపానికి సంబంధించిన 60 దేశాల నుండి  ఆర్థిక సహాయాన్ని పొందింది. అయితే  కేరళ రాష్ట్రానికి యూఏఈ సుమారు 700 కోట్ల సహాయాన్ని అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ సహాయాన్ని తీసుకోవడానికి  కేంద్రం  వెనుకడుగు వేసిన నేపథ్యంలో  ఎన్డీఏ -1 అదికారంలో ఉన్న  సమయంలో గుజరాత్ కు విదేశీ సహాయాన్ని తీసుకొన్న విషయాన్ని  కొందరు  గుర్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే  దేశంలో 14 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని కేరళలో సంభవించిన ప్రకృతి భీభత్సం నుండి ప్రజలను ఆదుకొనేందుకు మినహాయింపు ఇవ్వాలని  కేంద్ర మంత్రి  కే.జే అల్పోన్స్  కోరుతున్నారు. 

అయితే గురువారం ఉదయం మాత్రం ఇదే కేంద్ర మంత్రి 14 ఏళ్లుగా దేశంలో అనుసరిస్తున్న విధానాలనే తమ ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పారు. రాత్రికి మాత్రం మాట మార్చారు.  రాష్ట్రం కోసం  ఒక్క సారి 14 ఏళ్ల  పాటు సాగుతున్న సంప్రదాయాలను  మినహాయించాలని కోరుతున్నారు. కేరళలో చోటు చేసుకొన్న వరద నష్టం నుండి ప్రజలకు పునరావాస కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగాలంటే  విదేశీయుల నుండి వస్తున్న సహాయాన్ని తీసుకోవడంలో తప్పు లేదని కేంద్ర మంత్రి అభిప్రాయపడుతున్నారు. 

ఇదిలా ఉంటే  2000 సంవత్సరంలో  వాజ్‌పేయ్ నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ-1 కాలంలో విదేశాల నుండి  వచ్చిన సహాయాన్ని తీసుకొన్నట్టుగా కొందరు అధికారులు గుర్తు చేస్తున్నారు.ఈ మేరకు ఓ జాతీయ ఇంగ్గీష్ పత్రిక ప్రచురించింది.

2001లో గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ లో భూకంపం వచ్చిన సమయంలో  విదేశాల నుండి వచ్చిన  సహాయాన్ని తీసుకొన్నట్టుగా ఆ అధికారి గుర్తు చేశారు. ఆ సమయంలో సుమారు  60 దేశాల నుండి గుజరాత్‌కు సహాయం అందినట్టుగా ఆయన చెప్పారు. 

ఆ తర్వాత  ఆ తరహాలోనే సునామీ చోటు చేసుకొంది. 2004లో సునామీ కారణంగా తమిళనాడులో  నష్టం వాటిల్లింది.సునామీ సమయంలో కేంద్రంలో యూపీఏ-1 ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ, ఆసమయంలో విదేశీ సహాయాన్ని మాత్రం కేంద్రం తీసుకోలేదు. 

మరో వైపు  విదేశాల్లో నివసిస్తున్న  ఎన్‌ఆర్ఐలు కేరళలో చోటు చేసుకొన్న  పరిస్థితుల నేపథ్యంలో తమ వంతు సహాయాన్ని అందించాలని ప్రధాని మోడీ, కేరళ సీఎం విజయన్ కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios