Asianet News TeluguAsianet News Telugu

కేరళకు కేంద్రం నుంచి రూ.600 కోట్లు: అంచనా తర్వాత మరింత

 ప్రకృతి ప్రకోపానికి సర్వం  కోల్పోయిన కేరళ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ప్రకటించిన వరద సాయం 600 కోట్లు విడుదల చేసింది. ఆ సాయాన్ని ముందస్తు సాయంగా వినియోగించుకోవాలని ఆ తర్వాత ఇంటర్ మినిస్టీరియల్ టీమ్ వరద ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసిన తర్వాత మరింత నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. 
 

Rs 600 cr to Kerala was advance, more funds after assessment: Centre
Author
New Delhi, First Published Aug 24, 2018, 1:06 PM IST

న్యూ ఢిల్లీ:  ప్రకృతి ప్రకోపానికి సర్వం  కోల్పోయిన కేరళ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ప్రకటించిన వరద సాయం 600 కోట్లు విడుదల చేసింది. ఆ సాయాన్ని ముందస్తు సాయంగా వినియోగించుకోవాలని ఆ తర్వాత ఇంటర్ మినిస్టీరియల్ టీమ్ వరద ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసిన తర్వాత మరింత నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. 

కేరళ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అత్యవసర సేవలు, పునరావాస సేవలు అందుతున్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

కేరళ రాష్ట్రంలో పరిస్థితిపై రోజు ప్రధాని నరేంద్రమోదీ పర్యవేక్షిస్తున్నారని ఆగష్టు 17, 18న పర్యటించినట్లుు తెలిపారు. ద నేషనల్ క్రైసిస్, మేనేజ్మెంట్ కమిటీ, కేబినేట్ సెక్రటరీలతో ఈనెల 16 నుంచి 21 వరకు ప్రధాని అధ్యక్షతన రోజు సమావేశాలు సమావేశాలు నిర్వహించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.  

ఈ సమావేశానికి డిఫెన్స్ సర్వీసెస్ సీనియర్ అధికారి, ఎన్డీఆర్ఎఫ్,ఎన్డీఎంఏ, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీస్ సెక్రటరీ లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కేరళ చీఫ్ సెక్రటరీ ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్నట్లు ప్రకటించింది.  వరద ప్రభావం, పునారావాస కేంద్రాల్లో అందుతున్న సాయం, సహాయక చర్యలపై ఆరా తీసినట్లు అదేవిధంగా అధికారులు సమన్వయంతో పనిచెయ్యాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసినట్లు తెలిపింది. 

కేరళ వరదల్లో కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో సరికొత్త విధానాలను అవలంభించేలా సమావేశాల్లోనిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది. డిఫెన్స్ ఫోర్స్ అతిపెద్ద ఆపరేషన్ నిర్వహించినందని ప్రకటించింది. 40 హెలికాప్టర్లు, 30 ఎయిర్ క్రాఫ్ట్స్, 182 రెస్క్యూ టీమ్స్, 18మెడికల్ టీమ్స్ లతో సహాయక  చర్యలు చేపట్టిందని ప్రకటించింది. ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 58 బృందాలు....500 బోట్లతో సీఆర్పీఎఫ్ కు చెందిన 7 కంపెనీలు సేవలందించాయని కొనియాడింది. ఈ బృందాలన్నీ ఎంతో  శ్రమించాయని ఫలితంగా 60వేల మంది ప్రాణాలను కాపాడాయని అభిప్రాయపడింది. 

డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్,  హెలికాప్టర్స్ విశిష్టమైన సేవలందించాయని ఎయిర్ లిఫ్ట్ ద్వారా 3,332 మందిని కాపాడిందని తెలిపింది. అలాగే పునరావాస బాధితులకు రిలీఫ్ మెటీరియల్ అందించడంలో నావీ మరియు కోస్ట్ గార్డ్ షిప్స్ ఎంతో శక్తివంతంగా పనిచేశాయన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి కేంద్రం వదల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు స్పష్టం చేసింది. 

గతంలో కేరళలో మెుదటిసారిగా వరదలు వచ్చాయని అప్పడు జరిగిన నష్టంపై కేరళ రాష్ట్రప్రభుత్వం జూలై 21న నివేదిక సమర్పించిందని దాంతో ఇంటర్ మినిస్టీరియల్ టీమ్ ఆగష్టు 7 నుంచి 12 వరకు కేరళలో పర్యటించి జరిగిన నష్టంపై అంచనా వేసిందని తెలిపారు. 

కేంద్రమంత్రి కిరేణ్ రిజ్జూ జూలై 21న కేరళలో పర్యటించారని అలాగే ఆగష్టు 12న హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి పర్యటించారని తెలిపింది. రెండవ సారి వచ్చిన వరదలకు సంబంధించి జరిగిన నష్టంపై నివేదిక సమర్పించాలని సూచించింది. 

రెండోసారి వచ్చిన వరదల వల్ల కేరళకు భారీ నష్టం వాటిల్లిందని అయితే కేరళ ప్రభుత్వం వరద నష్టంపై అంచనా వెయ్యాలని ఆదేశించింది. పునరావాస కేంద్రాల్లో ప్రభుత్వం వెచ్చించిన నిధులు....సహాయక కేంద్రాలకు పెట్టిన ఖర్చుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరింది. అయితే కేంద్రప్రభుత్వం 600కోట్లు ముందస్తు సాయంగా  విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే వరద నష్టంపై హైలెవెల్ కమిటీ సమావేశమై మరింత నిధులు ఇస్తామని హామీ ఇచ్చింది. 

ఇప్పటికే 562.42 కోట్ల రూపాయలను కేరళ విపత్తుల శాఖ రిలీఫ్ ఫండ్ లో అందుబాటులో ఉంచినట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేరళకు మరింత ఆర్థిక సహాయం అందించడమేకాకుండా భారీస్థాయిలో ఆహారం, మంచినీరు, మందులు వంటి మౌలిక వసతులను పెద్ద ఎత్తున అందిస్తున్నట్లు తెలిపింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios