ముంబై: అనుమానాస్పద స్థితిలో మరణించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి ప్రియాంక సింగ్ మీద రియా చక్రవర్తి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ మేరకు బాలీవుడ్ నటి రియా చక్రవర్తి సోమవారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సుశాంత్ సింగ్ కు మందులు తీసుకోవడానికి ప్రియాంక సింగ్, ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన డాక్టర్ తరుణ్ కుమార్ బోగస్ మెడికల్ ప్రస్క్రిప్షన్ ను సృష్టించారని ఆమె ఆరోపించారు. ప్రియాంక తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని, తనను లైంగిక సంబంధం కోరుకుందని ఆమె అన్నారు. 

అసాధరణమైన ప్రవర్తనతో ప్రియాంక సింగ్ తన దేహాన్ని స్పృశించడం ప్రారంభించిందని, ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టిందని, లైంగిక సంబంధాన్ని డిమాండ్ చేసిందని రియా చక్రవర్తి తన ఫిర్యాదుచెప్పారు. 

Also Read: నాకొడుకును అరెస్ట్ చేసినందుకు కంగ్రాట్స్ ఇండియా...రియా తండ్రి విచిత్ర నిరసన

ముంబైలోని బాంద్రా పోలీసు స్టేషన్ లో రియా ఆ ఫిర్యాదు చేశారు. ఆ బోగస్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మందులు కొనుగోలు చేసిన ఐదు రోజుల తర్వాత సుశాంత్ సింగ్ మరణించినట్లు ఆమె తెలిపారు. 

ప్రియాంక్ సింగ్, డాక్టర్ తరుణ్ కుమార్ తదితరులను ఈ కేసులో విచారించడం అవసరమని, చట్టవిరుద్ధమై ప్రిస్క్రిప్షన్ ద్వారా మందులు ఎలా కొనుగోలు చేశారనే విషయాన్ని రాబట్టడానికి ఆ విచారణ అవసరమని ఆమె అన్నారు. 

Also Read: కంగనాకు తలపొగరు...ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

వాట్సప్ ద్వారా ప్రియాంక సుశాంత్ కు ఆ ప్రిస్క్రిప్షన్ పంపించిందని ఆమె ఆరోపించారు. సుశాంత్ సింగ్ మృతికి ఆరు రోజుల ముందు ప్రియాంక్ అతనికి పంపిన వాట్సప్ సందేశాల ఆధారంగా రియా ఫిర్యాదు చేశారు. 

వారం పాటు లిబ్రియం, ప్రతి రోజు నెక్సిటో, ఆంగ్జయిటీ అటాక్ చేసినప్పుడు లోనాజెప్ వాడాలని ప్రియాంక వాట్సప్ ద్వారా ప్రియాంక్ సుశాంత్ కు సూచించినట్లు తెలుస్తోంది. ఆ మందులు డిప్రెషన్ కు, ఆంగ్జయిటీకి వాడుతారు. 

తన సోదరి మీతూ సింగ్ వస్తోందనీ ఆమె తనను చూసుకుంటుందనీ చెప్పి సుశాంత్ సింగ్ వెళ్లిపోవాలని తనకు చెప్పాడని, దాంతో తాను సుశాంత్ సింగ్ ఇంటి నుంచి బయటకు వచ్చానని, అదే సుశాంత్ సింగ్ ను చివరిసారి చూడడమని రియా చెప్పింది. 

సుశాంత్ సింగ్ మానసిక ఆరోగ్యానికి మందులు వాడుతున్నాడని, అతను బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్నాడని ఆమె చెప్పింది. చికిత్సను సుశాంత్ సింగ్ తీవ్రంగా పరిగణించలేదని, మందులు సరిగా తీసుకోలేదని, ఇది తననూ వైద్యులనూ విస్మయానికి గురి చేసిందని ఆమె చెప్పారు.