Food
అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల శరీరంలోని కండరాలు రిలాక్స్ అయి నిద్ర బాగా పడుతుంది.
కివి పండులో సెరోటోనిన్, ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి. ఇది పండ్లను తిన్నా బాగా నిద్రపడుతుంది.
చెర్రీ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ పండ్లలో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ పెరుగుతుంది. దీంతో మీరు ప్రశాంతంగా నిద్రపోతారు.
బాదంలో ఉండే మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి.ఇది మీరు హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
ఓట్స్ మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. మెలటోనిన్ ఎక్కువగా ఉండే ఓట్స్ తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
పెరుగును రెగ్యులర్ గా తినడం వల్ల ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అయితే ఈ పెరుగు మీరు రాత్రిళ్లు కంటినిండా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది.
పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది మీరు హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
పాలలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చని పాలను తాగడం వల్ల కూడా నిద్రపడుతుంది.