ముస్లిం విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్.. యూపీ పోలీసులకు నోటీసులు
యూపీలో ఓ ముస్లిం సామాజికవర్గానికి చెందిన విద్యార్థిని చెంపదెబ్బ కొట్టాలని టీచర్ ఆదేశించిన ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ యూపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

యూపీలోని ముజఫర్ పూర్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఓ ముస్లిం విద్యార్థిని ఇతర సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులతో చెంపపై కొట్టించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యింది. ఈ విషయంలో యూపీ పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
విద్యార్థి చెంపపై కొట్టాలని ఆ బాలుడి క్లాస్ మేట్స్ ను టీచర్ ఆదేశించిన వీడియోపై కాలపరిమితితో దర్యాప్తు జరపాలని కోరుతూ సామాజిక కార్యకర్త తుషార్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ‘‘ ఇది చాలా సీరియస్ విషయం. యూపీ రాష్ట్రానికి నోటీసులు జారీ చేస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసులో దర్యాప్తు స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని ఎస్పీని ఆదేశించింది. ‘‘దర్యాప్తునకు అలాగే బాధితుడి రక్షణకు తీసుకున్న చర్యలను తెలుసుకోవాలనుకుంటున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది.
హిందూ మతం ఎప్పుడు, ఎవరు పుట్టించారో కూడా ఎవరికీ తెలియదు - కర్ణాటక హోం మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
2023 ఆగస్టులో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ ఉపాధ్యాయురాలు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిపై.. ఇతర క్లాస్ మేట్స్ ను చెంప దెబ్బ కొట్టాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇందులో మతపరమైన కోణం లేదని ఆ ఉపాధ్యాయురాలు తరువాత వివరణ ఇచ్చింది. బాలుడు హోం వర్క్ చేయకపోవడంతోనే శిక్ష విధించానని చెప్పారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టి నుజ్జునుజ్జైన వ్యాన్.. 6 గురు మృతి (వీడియో)
ఈ వీడియోను విద్యార్థి బంధువు చిత్రీకరించాడని, దీనిని మతపరమైన కోణంగా వక్రీకరించి, తర్వాత సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడని టీచర్ తెలిపారు. అయితే ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘అమాయక పిల్లల మనస్సుల్లో వివక్ష అనే విషాన్ని నాటడం, పాఠశాల వంటి పవిత్ర స్థలాన్ని విద్వేషాల మార్కెట్ గా మార్చడం... ఒక టీచర్ దేశం కోసం ఇంతకంటే ఘోరంగా ఏమీ చేయలేడు. ఇదే కిరోసిన్ ను బీజేపీ వెదజల్లుతూ భారతదేశం నలుమూలలా నిప్పులు చెరుగుతోంది. పిల్లలే భారతదేశానికి భవిష్యత్తు - వారిని ద్వేషించకండి, మనమందరం కలిసి ప్రేమను నేర్పాలి’’ అని ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు.