ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టి నుజ్జునుజ్జైన వ్యాన్.. 6 గురు మృతి (వీడియో)
ఆగి ఉన్న లారీని ఓ వ్యాన్ వెనకాల నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన తమిళనాడులోని సేలం ప్రాంతంలో జరిగింది.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాద జరిగింది. ఆగి ఉన్న ఓ లారీని వేగంగా, వెనకాల నుంచి ఓ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ఆ వ్యాన్ మొత్తం లారీలోకి చొచ్చుకెళ్లి నుజ్జునుజ్జైంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ దృష్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
ఎస్పీజీ చీఫ్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూత.. ఏమైందంటే ?
వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులో ఈగూరుకు చెందిన ఎనిమిది మంది ఓ వ్యాన్ లో పెరుంతురై వైపు వెళ్తున్నారు. అయితే ఈ వాహనం బుధవారం తెల్లవారుజామున సేలం-ఈరోడ్ హైవేపై ప్రయాణిస్తోంది. నాలుగు గంటల సమయంలో సాలెం దగ్గరకు చేరుకునే సరికి అక్కడ ఆగి ఉన్న ఓ లారీని వెనకాల నుంచి వేగంగా ఢీకొట్టింది. ఆ వాహనం వేగంగా ఉండటం వల్ల అది క్షణాల్లో లారీ లోపలికి చొచ్చుకెళ్లి, నుజ్జు నుజ్జైంది.
ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. వారిని సెల్వరాజ్, మంజుల, ఆర్ముగం, పళనిస్వామి, పప్పతిగా గుర్తించారు. మరో ఏడాది చిన్నారి కూడా చనిపోయిన వారిలో ఉంది. మిగిలిన ఇద్దరిలో వ్యాన్ డ్రైవర్ విఘ్నేష్, మరో ప్రయాణికురాలు ప్రియకు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించారు.
ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ క్షీణిస్తోంది.. కానీ ‘భారత్’ ఈ సంక్షోభం నుంచి బయటపడింది - మోహన్ భగవత్
ఈ ప్రమాదంపై సమాచారం అందడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.