Asianet News TeluguAsianet News Telugu

జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ స్థలాన్ని ఫొటో తీసిన నాసా ఉపగ్రహం.. మన విక్రమ్ ఇప్పుడు ఎలా ఉందంటే ?

చంద్రుడిపై ఉన్న విక్రమ్ ల్యాండర్ ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ఓ ఉపగ్రహం ఫొటో తీసింది. అలాగే దక్షిణ ధ్రువంలో చంద్రయాన్ -3 ల్యాండ్ అయిన లొకేషన్ ను కూడా గుర్తించింది. ఆ వివరాలను నాసా సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

NASA satellite took a picture of Chandrayaan-3 landing site on Zabili.. How is our Vikram now?..ISR
Author
First Published Sep 6, 2023, 2:42 PM IST

చందమామపై చంద్రయాన్ -3 ల్యాంగింగ్ స్థలాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన ఉపగ్రహం గుర్తించింది. దానిని ఫొటో తీసి నాసాకు పంపించింది. అందులో మన విక్రమ్ స్పష్టంగా కనిపిస్తోంది.చంద్రుడి దక్షిణ ధ్రువానికి 600 కిలోమీటర్ల దూరంలో భారత మూన్ మిషన్ చంద్రయాన్ -3 ల్యాండ్ అయినట్టు ఆ ఉపగ్రహం గుర్తించింది. నాసాకు చెందిన లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ వో) విక్రమ్ ల్యాండర్ కు సంబంధించిన ఈ ఫొటోలను తీసింది.

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ఫొటోతో పాటు లోకేషన్ ను నాసా మార్షల్ తన ఎక్స్ (ట్విట్టర్) పేజీలో పోస్టు చేసింది. ‘‘నాసాకు చెందిన ఎల్ఆర్ఓ వ్యోమనౌక ఇటీవల చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ -3 ల్యాండర్ ను చిత్రీకరించింది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) చంద్రయాన్ -3 2023 ఆగస్టు 23 న చంద్రుడి దక్షిణ ధ్రువానికి 600 కిలోమీటర్ల దూరంలో దిగింది.’’ అని పేర్కొంది. 

వాస్తవానికి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన నాలుగు రోజుల తర్వాత నాసా ఆర్బిటర్లోని కెమెరా దాని ఆబ్లిక్ ఫొటోను (42 డిగ్రీల కోణం) తీసింది. అందులో రాకెట్ ప్లూమ్ సన్నని రేగోలిత్ (మట్టి)తో సంకర్షణ చెందడం వల్ల వాహనం చుట్టూ ప్రకాశవంతమైన కాంతివలయం ఏర్పడిందని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. నాసా ఈ ఆర్బిటర్ 2019 జూన్ 18న ప్రయోగించింది. అప్పటి నుంచి అది ఇంకా చంద్రుడి చుట్టూ తిరుగుతోంది. దాదాపు నాలుగేళ్లుగా జాబిల్లి చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని నాసాకు చేరవేస్తోంది. ఈ ఆర్బిటాల్ చంద్రుడి గురించి ఎంతో నాలెడ్జ్ పెంచుకోవడానిక దోహదం చేసింది. 

ఆగస్టు 23న చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ చేయడం వల్ల  భారత్ ఒక పెద్ద మైలురాయిని సాధించింది. అమెరికా, చైనా, రష్యా తర్వాత చంద్రుడి ఉపరితలంపై దిగిన నాలుగో దేశంగా నిలిచింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై దిగిన తర్వాత సల్ఫర్, ఇతర మూలకాల అన్వేషణ, ఉష్ణోగ్రతలను నమోదు చేసింది. అలాగే అనేక సమీప కదలికలను విన్నది. ప్రస్తుతం 'స్లీప్ మోడ్'లో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్ లో ఉన్నాయి. అవి సెప్టెంబర్ 22న నిద్రలేచే అవకాశం ఉంది. కాగా.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి చంద్రయాన్ -3 విక్రమ్ ల్యాండర్ కు సంబంధించిన 3డీ 'అనాగ్లిఫ్ ' చిత్రాన్ని విడుదల చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios