విరసం నేత వరవరరావు సహా మిగిలిన పౌరహక్కుల నేతల గృహనిర్బంధాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 12 వరకు పొడిగించింది. భీమా-కొరేగావ్ అల్లర్లతో పాటు ప్రధాని నరేంద్రమోడీ హత్యకు కుట్రపన్నారనే ఆరోపణలపై విరసం నేత వరవరరావుతో పాటు వెర్నన్ గొనెసాల్వేన్, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవ్‌లఖాలను పుణె పోలీసులు అరెస్ట్ చేశారు.

వారిని గృహనిర్బంధం నుంచి విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా పుణె ఏసీపీ మీడియా సమావేశంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టు జోక్యం అనవసరమంటూ ఏసీపీ మీడియాకు వెల్లడించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని మహారాష్ట్ర  ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించింది.

ఆయుధాలు దొరికే చోటు వరవరరావుకి తెలుసు: పూణే పోలీసులు

మోడీ హత్యకు కుట్ర: 'అరెస్టైన హక్కుల నేతల నుండి వందల లేఖలు'

ఇంటికి చేరుకున్న వరవరరావు: సుప్రీం ఆదేశాలపై స్పందన

సుప్రీంకోర్టులో వరవరరావుకు ఊరట...

వరవరరావు అరెస్టు: కంట తడి పెట్టిన భార్య హేమలత

40 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు: వరవరరావు భార్య హేమలత

మోడీ హత్యకు కుట్రలో పేరు: విరసం నేత వరవరరావు అరెస్ట్