భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసినట్టుగానే ప్రధాని మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని మహారాష్ట్ర అడిషన్ డైరెక్టర్ జనరల్ పరంబీర్ సింగ్ ప్రకటించారు. 


ముంబై: భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసినట్టుగానే ప్రధాని మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని మహారాష్ట్ర అడిషన్ డైరెక్టర్ జనరల్ పరంబీర్ సింగ్ ప్రకటించారు.

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో అరెస్టైన పౌర హక్కుల సంఘాల నేతలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆయన చెప్పారు. ఈ మేరకు తన వద్ద రుజువులు ఉన్నాయని చెప్పారు. 

Scroll to load tweet…

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పాటు పుణెకు సమీపంలోని భీమా కోరెగావ్‌ గ్రామంలో జరిగిన హింస కేసులో విప్లవ రచయిత సంఘం(విరసం) నేత వరవరరావును, హక్కుల నేతలు వెర్నాన్‌ గోంజాల్వేస్‌, అరుణ్‌ ఫెరీరియా, సుధా భరద్వాజ్‌, గౌతమ్‌ నవలఖలను అరెస్టు చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వరవరరావు,గోంజాల్వేస్‌, ఫెరీరియాలను గృహ నిర్భంధానికి పరిమితం చేశారు.

రాజీవ్‌గాంధీ తరహాలో మోదీని హత్య చేయాలని ప్రణాళికలు వేసినట్లు అరెస్టు అయిన పౌరహక్కుల నేతకు, మావోయిస్టులకు మధ్య లేఖల ద్వారా సంభాషణ జరిగిందన్నారు. 

గ్రనేడ్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వాల్సిందిగా ఆ లేఖ‌లో ఉందన్నారు. పౌరహక్కుల నేతల దగ్గర నుంచి కొన్ని వందల లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న డిస్క్‌ల్లో ఒక రాకెట్‌ లాంచర్‌ పాంప్లెట్‌ లభ్యమైంది’ అని పరంబీర్‌ తెలిపారు.

ఈ వార్తలు చదవండి

పూణె పోలీసుల సోదాలు: వరవరరావు ఇంటి వద్ద ఉద్రిక్తత

మోడీ హత్య కుట్రలో పేరు: వరవరరావుఇంట్లో తనిఖీలు

మోడీ హత్యకు మావోల కుట్ర: లేఖలో వరవరరావు పేరు