ఇక వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో స్లీపర్ కోచ్ లు.. వచ్చే ఏడాది అందుబాటులోకి..
వేగవంతమైన, సురక్షితమైన, లగ్జరీ ప్రయాణాన్ని అందిస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ లలో ఇక స్లీపర్ వేరియంట్లు రానున్నాయి. 2024 వరకు వీటిని అందుబాటులోకి తీసుకురావాలని భారతీయ రైల్వే భావిస్తోంది.
ఇప్పటివరకు చైర్ కార్ బోగీలకే పరిమితమైన వందేభారత్ రైళ్లలో త్వరలో స్లీపర్ కోచ్ లు రానున్నాయి. ఈ మేరకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ కోచ్ ల తయారీకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) కసరత్తు చేస్తోంది. ఈ రైళ్లలో స్లీపర్ వేరియంట్ ను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే యోచిస్తున్నట్లు ‘టైమ్స్ నౌ’ కథనం పేర్కొంది.
టమాటాలు తినడం మానేస్తే ధరలు తగ్గుతాయి - యూపీ మంత్రి ప్రతిభా శుక్లా వింత సలహా
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల స్లీపర్ వేరియంట్ ప్రోటోటైప్ ను ఐసీఎఫ్ 2024 వరకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అందులో భాగంగానే వందే భారత్ రైళ్ల 120 స్లీపర్ వేరియంట్లను తయారు చేసేందుకు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్), రష్యాకు చెందిన టీఎంహెచ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
కాగా.. ఇప్పుడున్న వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ హై స్పీడ్ రైళ్లు 25 రూట్లలో 50 సర్వీసులను కొనసాగిస్తున్నాయి. ఇటీవల చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)ను సందర్శించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఐసీఎఫ్ లో ఉత్పత్తిలో ఉన్న వందే భారత్ రైళ్లు ఇప్పటి కంటే మెరుగైన సౌకర్యాలు కలిగి ఉంటాయని ప్రకటించారు.
ఫస్ట్ నైట్ గదికి సోదరుడిని తీసుకెళ్లిన భర్త.. షాక్ అయిన నవ వధువు.. ఇద్దరూ కలిసి బలవంతంగా..
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. కొత్త వందే భారత్ రైళ్లలో సీట్లు ఎక్కువ రెక్లైన్ కలిగి ఉండనున్నాయి. దీని వల్ల ప్రయాణికుల మరింత సౌకర్యం కలుగనుంది. అలాగే నీరు చిమ్మకుండా ఉండటానికి మరుగుదొడ్లలో లోతైన వాష్ బేసిన్ లు, సీట్ల కింద మెరుగైన మొబైల్ ఛార్జింగ్ సదుపాయం ఉండనుంది.
ప్రియుడితో లేచిపోయిన భార్య.. పెద్ద మనసుతో వారిద్దరికీ వివాహం జరిపించిన భర్త..
ఎగ్జిక్యూటివ్ చైర్ కారులో సీటు రంగు ప్రస్తుతమున్న ఎరుపు నుండి నీలం రంగులోకి మారనుంది. ఎగ్జిక్యూటివ్ చార్ కార్లలో ఫుట్ రెస్ట్ లు విస్తరించనున్నాయి. అలాగే మరుగుదొడ్లలో మెరుగైన లైటింగ్. రోలర్ బ్లైండ్ ఫ్యాబ్రిక్ లో మెరుగుదల కనిపించనుంది. ఎగ్జిక్యూటివ్ చైర్ కారు కోసం మ్యాగజైన్ బ్యాగులు, అత్యవసర సమయంలో మెరుగైన యాక్సెస్ కొరకు మెరుగైన హ్యామర్ బాక్స్, అత్యవసర పరిస్థితుల్లో రైలు డ్రైవర్ కు మెరుగైన కనెక్టివిటీ కొరకు ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ రానున్నాయి. వీటి తో పాటు మెరుగైన అగ్నిమాపక వ్యవస్థ, లగేజీ ర్యాక్ లైట్ల కొరకు స్మూత్ కంట్రోల్స్, మెరుగైన ఎయిర్ కండిషనింగ్ అందుబాటులో రానుంది.