దళిత బాలికపై గ్యాంగ్ రేప్.. ప్రేమ పేరుతో వల వేసి, లాడ్జికి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం.. మూడు రోజుల తరువాత..

ఓ యువకుడు మరో వ్యక్తితో కలిసి ఓ దళిత బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి.. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఏపీలోని చోటు చేసుకుంది. 

Dalit girl gang-raped.. In the name of love, they put a net, took her to the lodge and brutally.. Three days later..ISR

ఓ వ్యక్తి దలిత బాలికను ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పాడు. తొమ్మిదో తరగతి చదివే ఆ బాలిక అతడి మాటలను నిజమని నమ్మింది. ఒక రోజు ఏకాంతంగా గడుపుదామని చెప్పే సరికి.. అతడితో పాటు వెళ్లింది. కానీ అతడు మోసం చేశాడు. ఆ బాలికపై మరొకరితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని తట్టుకోలేక మనస్థాపంతో బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. 

ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల దలిత బాలిక స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె తన తల్లిదండ్రులో కలిసి నివసిస్తోంది. అయితే ఆ బాలిక ఉండే కాలనీకి లోకేష్ అనే వ్యక్తి చాలా సార్లు  వచ్చేవాడు. ఈ క్రమంలో బాలికతో అతడు పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బాలికను ప్రేమిస్తున్నానని వెంట పడేవాడు. బాలికను తనవైపు తిప్పుకునేందుకు ఏవేవో చెప్పేవాడు.

అయితే ఈ నెల 20వ తేదీన లోకేష్ బాలికకు ఫోన్ చేశాడు. ఇద్దరం కలిసి ఏకాంతంగా గడుపుదామని, తాను చెప్పిన ప్రదేశానికి రావాలని సూచించాడు. అతడి మాటలు బాలిక నమ్మి, ఎప్పటిలాగే ఆ రోజు కూడా స్కూల్ కు వెళ్తున్నానని చెప్పి, బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి బయలుదేరింది. అనంతరం స్కూల్ దగ్గరికి వెళ్లి, బయటే బ్యాగ్ ను విడిచిపెట్టింది. తరువాత ఓ యువకుడిని లిఫ్ట్ అడిగింది. బాలిక చెప్పిన విధంగా అతడు ఆమెను విజయవాడ-మచిలీపట్నం నేషనల్ హైవే దగ్గర దించాడు. 

కొంత సమయం తరువాత ఆ బాలిక ఉన్న ప్రదేశానికి లోకేష్ వచ్చాడు. తన వాహనంపై ఎక్కించుకొని ఉయ్యూరుకు తీసుకెళ్లాడు. అక్కడి ఓ లాడ్జిలో ఓ రూమ్ తీసుకొని, బాలికను అందులోకి తీసుకెళ్లాడు. అయితే ఆ లోకేష్ తనకు సోదురుడి వరస అయ్యే నరేంద్రకు కాల్ చేశాడు. ఉయ్యూరులో తాను ఉన్న లాడ్జి వద్దకు రావాలని సూచించాడు. కొంత సమయం తరువాత అతడు వచ్చాడు. అనంతరం ఒకరి తరువాత ఒకరు బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టారు. 

మరో వైపు స్కూల్ బయట బ్యాగ్ ఉండటాన్ని అక్కడి వాచ్ మన్ గమనించాడు. ఈ విషయాన్ని వెంటనే హెచ్ఎంకు తెలియజేశారు. దీంతో హెచ్ఎం తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే స్కూల్ కు బాలిక తల్లి ఆందోళన చెందుతూ వచ్చింది. బాలిక స్కూల్ కు రాలేదని టీచర్లు ఆమెకు బదులిచ్చారు. కాగా.. అంతకు ముందు బాలికకు లిఫ్ట్ ఇచ్చిన బాలుడిని ఆరా తీయగా.. తాను ఆమెను హైవే సమీపంలోని బ్రిడ్జి వద్ద దించానని చెప్పాడు. అలాగే తన సెల్ ఫోన్ నుంచి బాలిక  లోకేష్ అనే వ్యక్తికి కాల్ చేసిందని, తరువాత తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని సమాధానం ఇచ్చాడు. 

అనంతరం బాలిక తల్లిదండ్రులు లోకేష్ కు కాల్ చేశారు. ఫోన్ లోనే ఇదేంపని అని నిలదీయడంతో, కంగారు పడిన అతడు లాడ్జిలో నుంచి బాలికను తీసుకొని బయలుదేరాడు. ఆమె ఇంటికి దగ్గరలో దించేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ బాలిక ఇంటికి వెళ్లలేదు. చీకటి అయినా తమ కూతురు ఇంటికి రాలేదని ఆందోళన చెందుతూ తల్లిదండ్రులు పామర్రు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. 

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లోకేష్, నరేంద్రలను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించారు. దీంతో తాను బాలికను ఇంటి దగ్గరలో విడిచిపెట్టానని లోకేష్ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలో ఆదివారం మొవ్వ మండలంలోని సూరసానిపల్లి లో ఉన్న కాలువలో బాలిక డెడ్ బాడీ కనిపించింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. నిందితులపై పోలీసులు గ్యాంగ్ రేప్, పోక్సో, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తు జరపుతున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios