Asianet News TeluguAsianet News Telugu

ఫస్ట్ నైట్ గదికి సోదరుడిని తీసుకెళ్లిన భర్త.. షాక్ అయిన నవ వధువు.. ఇద్దరూ కలిసి బలవంతంగా..

కొత్తగా పెళ్లయిన ఓ యువకుడు శోభనం గదికి వెళ్లేటప్పుడు తన సోదరుడిని కూడా తీసుకుపోయాడు. అతడితో కలిసి భార్యపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

The husband who took his brother to the room for the first night.. the shocked new bride.. both of them forcibly raped her together..ISR
Author
First Published Jul 24, 2023, 10:18 AM IST

ఆ యువతి అందరిలాగే పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తన భర్తతో కలిసి అన్యోన్నంగా ఉండాలని భావించింది. వైవాహిక బంధంపై సంతోషంగా ఉండాలని ఎన్నో ఊహించుకుంది. కానీ అవన్నీ పెళ్లయిన మరుసటి రోజే పటాపంచలయ్యాయి. వివాహమైన మరుసటి రోజే ఆ యువతికి వింత అనుభవం ఎదురైంది. ఫస్ట్ నైట్ గదికి తన భర్త సోదరుడితో కలిసి వచ్చాడు. దీనిని చూసి నవ వధువు షాక్ అయ్యింది. వద్దంటున్న వినకుండా ఆ అన్నదమ్ములిద్దరూ బలవంతంగా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు

సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అల్వార్ జిల్లాకు చెందిన యువతికి ఆమె తల్లిదండ్రులు కొంత కాలం కిందట ఖిలోరా ప్రాంతానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించారు. పెద్దల సమక్షంలో వారిద్దరికీ జూన్ 11వ తేదీన ఘనంగా వివాహం జరిగింది. ఆ యువకుడికి అడిగినంత కట్నం ఇచ్చారు. తమ కూతురు సంతోషం కోసం ఆ తల్లిదండ్రులు ఏ లోటూ లేకుండా వివాహం జరిపించారు.

పెళ్లయిన అనంతరం ఆ యువతి వరుడుతో కలిసి తన అత్తగారింటికి వెళ్లింది. మరసటి రోజు రాత్రి ఆ కొత్త దంపతులకు కుటంబ సభ్యులు శోభనం ఏర్పాటు చేశారు. ముందుగా నవ వధువు గదిలోకి వెళ్లి తన భర్త కోసం ఎదురు చూస్తోంది. కొంత సమయం తరువాత భర్త తలుపు తెరిచి లోపలికి ప్రవేశించాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతడు తన సోదరుడిని కూడా వెంటబెట్టుకొని వచ్చాడు. ఆ ఇద్దరినీ చూసి ఆ నవ వధువు ఒక్కసారిగా షాక్ అయ్యింది. సోదరుడిని ఎందుకు ఫస్ట్ నైట్ గదిలోకి తీసుకొచ్చావని భర్తను ప్రశ్నించింది. 

ఇది మంచి పద్దతి కాదని నిలదీసింది. కానీ భర్త ఆమె మాటలు వినలేదు. తన సోదరుడితో కలిసి నవ వధువుపై అత్యాచారానికి ఒడిగట్టారు. తనను వదిలిపెట్టాలని ఆ కొత్త పెళ్లి కూతురు ఎంత ప్రాధేయపడినా వారు వినిపించుకోలేదు. ఆమెపై క్రూరంగా ప్రవర్తించారు. పశువుల్లా లైంగికదాడి చేశారు. తనపై జరిగిన దారుణాన్ని ఆమె తన అత్తమామలకు మరుసటి రోజు చెప్పింది. కానీ వారు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. పైగా సొంత కూతురిలా కోడలిని చూసుకోవాల్సిన మామ.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెతో అసభ్యకరంగా వ్యవహరించేవాడు. 

రెండో రోజు రాత్రి కూడా భర్త, తన సోదరుడితో కలిసి ఆ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. రెండు రోజులుగా తనపై జరుగుతున్న ఈ అఘాయిత్యాన్ని ఆ నవ వధువు తట్టుకోలేకపోయింది. ఆమె స్పృహతప్పి పడిపోయింది. దీంతో ఆమెను చికిత్స కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ తనపై అత్తగారింట్లో జరుగుతున్న లైంగికదాడిని బాధితురాలు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై సమాచారం అందటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితురాలితో మాట్లాడి, ఫిర్యాదు స్వీకరించారు. ఆమె భర్తతో పాటు, సోదరుడు, మామ, అత్తపై పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios