భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. డబ్బుకు ఆశపడి అక్క తన చెల్లెతో వ్యభిచారం చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ అయిన చెల్లెకు డ్రగ్స్ ఇచ్చి వ్యభిచారం చేయించింది. విషయం తెలిసిన తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

దాంతో పోలీసులు రంగప్రవేశం చెసి అక్కతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. భోపాల్ కు చెందిన 15 బాలిక డ్రగ్స్ కు బానిసైంది. దాంతో కౌన్సెలింగ్ కోసం తల్లి ఆమెను ఎన్జీవోలో చేర్పించింది. అయితే, బాలిక దిగ్భ్రాంతికరమైన విషయాలను బయటపెట్టింది. 

రెండేళ్ల క్రితం తన సోదరి (20) తనకు డ్రగ్స్ అలవాటు చేసిందని, డ్రగ్స్ ఇచ్చి తనతో వ్యభిచారం చేయించిందని చెప్పింది. ఇప్పటి వరకు ఐదుగురు వ్యక్తులతో ఆరుసార్లు తనను పంపించిందని చెప్పింది. దాంతో బాలిక తల్లి గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత బాధితురాలి అక్కను అరెస్టు చేసి విచారించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.