Asianet News TeluguAsianet News Telugu

Drugs case: సిద్ధాంత్ కపూర్ డ్రగ్స్ కేసు.. 40 మంది మోడ‌ల్స్ కు పోలీసుల నోటీసులు !

Karnataka police: రేవ్ పార్టీకి 150 మంది మోడల్స్, సెలబ్రిటీలు హాజరయ్యార‌నీ, 40 మంది విదేశీ, భారతీయ మోడళ్లకు నోటీసులు జారీ చేసినట్లు క‌ర్నాట‌క పోలీసులు తెలిపారు. వారంలోగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. 
 

Siddhanth Kapoor Drugs case: Karnataka police issue notice to models
Author
Hyderabad, First Published Jun 21, 2022, 4:47 PM IST

Siddhanth Kapoor Drugs case: నటుడు శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్‌కు సంబంధించిన డ్రగ్స్ కేసులో క‌ర్నాట‌క పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బెంగళూరులోని ఓ లగ్జరీ హోటల్‌లో సిద్ధాంత్‌ కపూర్‌తో కలిసి డ్రగ్స్ తీసుకోవ‌డం,  వినియోగానికి సంబంధించి రేవ్‌ పార్టీలో పాల్గొన్న విదేశీ, భారతీయ మోడల్స్‌కు నోటీసులు అందాయి. రేవ్ పార్టీకి 150 మంది మోడల్స్, సెలబ్రిటీలు హాజరయ్యారని పోలీసులు తెలిపారు. వీరిలో 40 మంది విదేశీ, భారతీయ మోడళ్లకు నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారంలోగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇప్ప‌టివర‌కు  ఆరుగురు మహిళా మోడల్స్ విచారణకు హాజరై వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. మోడల్‌లు మరియు సెలబ్రిటీల లావాదేవీలు మరియు కనెక్షన్‌లు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించబడ్డాయి. వాటిపై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని పోలీసులు వ‌ర్గాలు పేర్కొన్నాయిన‌. 

రేవ్ పార్టీలో పాల్గొన్న విదేశీయులు వీసా గడువు ముగిసినా దేశంలో అక్రమంగా ఉంటున్నట్లు విచారణలో తేలింది. డ్రగ్స్ దొరికిన రేవ్ పార్టీకి పలువురు సెలబ్రిటీలు, మోడల్స్ హాజరయ్యారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వ‌చ్చాయ‌నేదానిపై పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినా డస్ట్‌బిన్‌ దగ్గర డ్రగ్స్‌ పారేసే వ్యక్తులను పోలీసులు గుర్తించ‌లేక‌పోయారు. కాగా,  జూన్ 12న, డ్రగ్స్ చెలామణి అవుతున్న రేవ్ పార్టీ గురించి పక్కా సమాచారంతో బెంగళూరు నగరంలోని హలాసూరు పోలీసులు ఓ లగ్జరీ హోటల్‌పై దాడులు నిర్వహించారు. నటి శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌తో సహా 35 మంది వ్యక్తులకు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. సిద్ధాంత్  కపూర్‌తో సహా ఆరుగురు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో నిర్ధారించారు. అనంతరం స్టేషన్ నుంచి బెయిల్‌పై నిందితులు విడుదలయ్యారు. తనకు ఎవరో నీళ్లు, మత్తు మందు కలిపిన సిగరెట్‌లు ఇచ్చారని సిద్ధాంత్‌ కపూర్‌ విచారణలో పోలీసులకు తెలిపాడు. ఆ విషయం తనకు తెలియదని విచారణాధికారులకు వెల్ల‌డించాడు. 

తాను డ్రగ్స్ తీసుకున్నట్లు సిద్ధాంత్ కపూర్ అంగీకరించలేదని డీసీపీ భీమాశంకర్ గులేద్ తెలిపారు. “ఎవరో తన డ్రింక్స్‌లో కలిపారని, డ్రగ్స్ గురించి తనకు తెలియదని సిద్ధాంత్ కపూర్ వాదిస్తున్నాడు. తాను 40 సార్లు బెంగళూరుకు వచ్చి డీజేగా పార్టీలకు హాజరయ్యానని చెప్పారు. అతను హోటల్‌కు వచ్చి అరెస్టు చేయడం ఇది నాలుగోసారి” అని డీసీపీ గులేద్ తెలిపారు. "మేము అతిథి జాబితాను తీసుకున్నాము మరియు అనుమానాస్పద వ్యక్తులను విచారణ కోసం పిలుస్తాము" అని పోలీసులు తెలిపారు. నిందితుల మొబైల్స్‌ను డేటా రిట్రీవల్ కోసం పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించారు. మాదకద్రవ్యాల వ్యాపారంతో సిద్ధాంత్ కపూర్ మరియు ఇతరుల సంబంధాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేవ్ పార్టీ నిర్వాహకులకు, లగ్జరీ హోటల్ యజమానికి కూడా పోలీసులు నోటీసులు పంపారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రతినిధులను కూడా విచారణకు పిలిచారు.

ఐపీసీ సెక్షన్లు 20 A, 22 B, 27 B కింద కేసు నమోదు చేశారు. మైండ్ ఫైర్ సొల్యూషన్స్ బిజినెస్ మేనేజర్ అఖిల్ సోనీ, పారిశ్రామికవేత్త హర్జోత్ సింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ హనీ మరియు ఫోటోగ్రాఫర్ అఖిల్‌లను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 12న బెంగళూరులోని లగ్జరీ హోటల్ ది పార్క్‌లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి 7 గ్రాముల MDMA క్రిస్టల్స్ మరియు 10 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios