ఆమె పేరు సోనూ పంజాబన్. అసలు పేరు గీతా అరోరా. నలుగురు గ్యాంగ్ స్టర్ లను పెళ్లాడి.. వేశ్య సామ్రాజ్యానికి అధిపతిగా.. మహారాణిగా చెలామణి అయిన సోనూ.. ఇప్పుడు జైల్లో బలవన్మరణానికి ప్రయత్నించింది. మహిళలు, చిన్నారుల కిడ్నాప్, అక్రమ రవాణా, వ్యభిచారం తదితర కేసుల్లో పోలీసులకు చిక్కిన సోనూ.. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తోంది. కాగా.. తాజాగా.. ఆమె జైల్లో విషం తాగి.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

వెంటనే గమనించిన జైలు సిబ్బంది.. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. వైద్యులు చికిత్స అందించగా.. ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని అధికారులు చెప్పారు. 

కాగా.. సోను పంజాబన్ అసలు పేరు గీతా అరోరా. ఆమె 1981లో ఢిల్లీలో జన్మించింది. ఆమె తండ్రి ఓం ప్రకాష్ అరోరా పాకిస్థాన్ శరణార్థి. ఆయన హర్యానాలో ఉంటున్నారు. రేణు పంజాబన్ తొలిసారిగా 2007లో అరెస్టు అయ్యింది. 2003 లో తండ్రి మరణాంతరం ఆమె ప్రాస్టిట్యూషన్‌లో యాక్టివ్‌గా వ్యవహరిస్తూ వస్తోంది. 2011లో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. 2012లో కూడా ఆమె తీహార్ జైల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం గమనార్హం.

కాగా..హీరోయిన్లను తలదన్నే అందంతో ఆకట్టుకుంటుంది సోను. ఆమె నలుగురు గ్యాంగ్ స్టర్ లను పెళ్లాడింది. అయితే.. ఆ నలుగురు ఎన్ కౌంటర్ లో చనిపోవడం గమనార్హం. సినిమాల్లోకి, మోడలింగ్ రంగంలోకి రావాలని ఆశ పడే అమ్మాయిలను ట్రాప్ చేసి.. వ్యభిచారంలోకి బలవంతంగా దింపే వ్యాపారంలో సోనూ రాటుదేలింది. ఈ వ్యాపారంలో ఆమె కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి.