పశ్చిమ బెంగాల్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు మంచి ఆతిథ్యం ఇవ్వాలని టీఎంసీ అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎలాంటి విధ్వంసకర ఘటనలూ జరగకుండా చూసుకోవాలని పోలీసులను ఆదేశించారు. 

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పర్యటన సందర్భంగా ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. స్వీట్లు, పండ్లతో ఆయనకు స్వాగతం పలకాలని పోలీసులను ఆమె కోరారు. సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో జరిగిన ఒక అడ్మినిస్ట్రేటివ్ అంశాల‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తున్న‌ప్పుడు ఈ విధంగా వ్యాఖ్యానించారు. 

ప‌శ్చిమ బెంగాల్‌లో మన అతిథులను మనం ఎంత బాగా చూసుకుంటామో వారికి (సంఘ్) అర్థమయ్యేలా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కి కొన్ని స్వీట్లు పంపాలని ఆమె సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కేషియారీలో మూడు రోజుల పాటు బస చేస్తారని చెప్పారు. భగవత్‌కు రక్షణ కల్పించాలని, ఆయన పర్యటనలో ఎలాంటి అల్లర్లు జరగకుండా చూడాలని అన్నారు. 

షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీయాకు బెయిల్..

కాగా.. ఈ సమీక్ష సమావేశం సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. పొరుగున ఉన్న జార్ఖండ్, బీహార్ నుండి పశ్చిమ బెంగాల్‌కు తుపాకీలతో వస్తున్నాయని, ఈ త‌ర‌హా ఘ‌ట‌నలు పెరుగుతున్నాయ‌ని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ బీహార్‌లో అక్రమ ఆయుధాల తయారీ యూనిట్ ఉంది. బీహార్, జార్ఖండ్‌లకు చెందిన దుండగులు రైళ్ల ద్వారా తుపాకీలను తీసుకుని పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశిస్తున్నారు. పోలీసులను మభ్యపెట్టేందుకు వారు కూరగాయల కింద తమ ఆయుధాలను దాచుకుంటున్నారు. దీనిని తనిఖీ చేయడంలో GRP చురుకుగా వ్యవహరించడం లేదు. ’’ అని ఆమె అన్నారు. 

Gyanvapi Mosque: ఒక వ‌ర్గాన్ని రెచ్చ‌గొడుతున్న అస‌దుద్దీన్ ఓవైసీ : బీజేపీ

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) కింద రావాల్సిన బకాయిలను కేంద్ర ప్రభుత్వం చెల్లించడం లేదని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ మండిపడ్డారు. గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ బకాయిలను కేంద్రం చెల్లించలేదని ఆమె ఆరోపించారు. అనంతరం అక్రమ కలప స్మగ్లింగ్‌పై వచ్చిన నివేదికలపై బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

త‌ల్లి మృత‌దేహాన్ని ప్లాస్టిక్ డ్ర‌మ్ లో పెట్టి.. సిమెంట్ తో క‌ప్పేసిన కుమారుడు..

ఇదిలా ఉండగా ఆర్ఎస్ఎస్ చీఫ్ ను ఉద్దేశించి మ‌మ‌తా బెన‌ర్జీ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆ ఆధ్యాత్మిక సంస్జ సీనియర్ కార్యకర్త దేబాసిస్ చౌదరి స్పందించారు. ‘‘ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మా సామాజిక-సాంస్కృతిక కార్యకలాపాలపై ఆసక్తి చూపడం ఆసక్తికరంగా ఉంది. అదే సమయంలో, ఇస్లామిక్ సంస్థలు నిర్వహిస్తున్న తబ్లిఘి జమాత్ క్యాంపులను సందర్శించాలని మేము ఆమెను కోరుతున్నాము ’’ అని ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శిబిరాన్ని బెనర్జీ స్వయంగా చూస్తే బాగుంటుందని, అక్కడ యువతకు విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు శారీరక శిక్షణ కూడా ఇస్తున్నారని చెప్పారు.