Asianet News TeluguAsianet News Telugu

షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీయాకు బెయిల్..

మాజీ మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జీయాకు బెయిల్‌పై విడుదల కానున్నారు. తన కూతరు షీనా బోరాను హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీయా 2015 నుంచి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమెకు సుప్రీం కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.

Indrani Mukerjea Gets Bail in her Daughter Sheena Bora murder case
Author
New Delhi, First Published May 18, 2022, 12:08 PM IST

మాజీ మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జీయాకు బెయిల్‌పై విడుదల కానున్నారు. తన కూతరు షీనా బోరాను హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీయా 2015 నుంచి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమెకు సుప్రీం కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ‘‘మేము ఇంద్రాణి ముఖర్జీయాకు బెయిల్ మంజూరు చేస్తున్నాం. ఆరున్నర సంవత్సరాలు చాలా ఎక్కువ సమయం.. ఆమె ఇప్పటికే చాలా కాలం జైలు జీవితం గడిపినందున బెయిల్ పొందేందుకు అర్హులు. షరతులతో కూడిన బెయిల్ పొందేందుకు ఆమె అర్హులు. కేసు విచారణను ప్రభావితం చేసే మెరిట్‌లపై మేము ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదు’’ అని బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు పేర్కొంది. 

విచారణ త్వరగా పూర్తికాదని.. 50 శాతం మంది సాక్షుల వాంగ్మూలాలు ఇంకా నమోదు కాలేదని సుప్రీంకోర్టు సూచించింది. ఇది సందర్భోచిత సాక్ష్యాల కేసు అని కూడా న్యాయమూర్తులు గుర్తించారు. 

ఇక, షీనా బోరా హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2012లో షీనా బోరా హత్యకు గురయ్యారు. అయితే షీనాను హత్య చేశారనే ఆరోపణలపై ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీయా విచారణ ఎదుర్కొంటున్నారు. 2015 ఆగస్టు 25న ఇంద్రాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, 2015 సెప్టెంబర్‌ నుంచి ఆమె బైకుల్లా జైలులో ఉంటున్నారు. ఈ కేసులో ఇంద్రాణి మాజీ భర్త పీటర్ ముఖర్జీయా, స్టార్ ఇండియా మాజీ సీఈవో  సంజీవ్ ఖన్నా సహా నిందితులుగా ఉన్నారు. గతేడాది కోర్టు పీటర్‌కు బెయిల్ మంజూరు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios