కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 370 రద్దు గురించి హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదిస్తున్న సమయంలోనే కాంగ్రెస్, పీడీపీ సహా పలు విపక్ష పార్టీల నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. బీజేపీ రాజ్యాంగాన్ని హత్య చేసిందని ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని.. కేంద్రం నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.  

భయాందోళనలు రేకెత్తించి కాశ్మీర్‌ను బలవంతంగా లాక్కొంటున్నారని ఆమె మండిపడ్డారు. ఈ సమయంలో పీడీపీ సభ్యులు రాజ్యాంగ ప్రతులను చించివేయడంతో పాటు చొక్కాలు చించుకుని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు పీడీపీ సభ్యులను సభ నుంచి బయటకి పంపాలని మార్షల్స్‌ను ఆదేశించారు. ఇదే సమయంలో ఆర్టికల్ 370 రద్దును నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. 

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం