ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో జరిగిన విషాదం యావత్ దేశాన్ని కుదిపి వేసింది. అభిమాన క్రికెటర్లను చూడాలనుకున్న వారు తిరిగి రాని లోకాలకు వెళ్లారు. దీంతో ఇప్పుడీ అంశం చుట్టూ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
18 ఏళ్ళ తర్వాత వచ్చిన ఆనందం 18 గంటలు కూడా నిలవలేదు. 11 మంది చావుకి ఎవరు కారణం అని అందరూ అడుగుతున్నారు. హడావుడిగా వేడుకలు ఎందుకు చేయించారు? చిన్నస్వామి స్టేడియంలో ఒక్క రోజు ఆలస్యంగా చేస్తే పోలీసులకి సమయం ఉండేది. ఇంత తొందరేమిటి..? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
* విధానసౌధ దగ్గర వేడుకలు ఎందుకు నిర్వహించారు.?
* ముందు జాగ్రత్తలు లేకుండా వేడుకలు ఎందుకు నిర్వహించారు.?
* సిద్ధరామయ్య మనవడి కోసం, జమీర్ ఖాన్ కొడుకు కోసం, మంత్రుల పిల్లల కోసం ప్రభుత్వం పేరుతో వేడుకలు ఎందుకు?
* ఎంతమంది అభిమానులు వస్తారో అంచనా వేయలేని దుస్థితిలో పోలీసుల ఉన్నారా?
* రూట్ మ్యాప్ లేదు, ఎంట్రీ-ఎగ్జిట్ క్లియర్ గా లేదు, అంబులెన్స్‌లు లేవు.
* వరల్డ్ కప్ గెలిచిన జట్టు ముంబై వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ మంది వచ్చారు, కిలోమీటర్ల మేర ర్యాలీ చేశారు. అంతా సజావుగా జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకిలా జరిగింది.?
ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. మరి వీటికి ప్రభుత్వం సమాధానం చెబుతుందా.? చూడాలి.
* పహల్గామ్ దాడి ఘటనలో భద్రతా వైఫల్యం అన్న ఓ మంత్రి మరి ఈ ఘటనపై ఎలా స్పందిస్తారు.?
