Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ రాజీనామా.. కారణమేంటంటే ?

పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా (Punjab Governor Banwarilal Purohit has resigned from his post) చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)కు లేఖ రాశారు. రాజీనామాను ఆమోదించాలని కోరారు.

Punjab Governor Banwarilal Purohit resigns What's the reason?..ISR
Author
First Published Feb 4, 2024, 9:26 AM IST

పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరిలాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలను చూపుతూ శనివారం ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా సమర్పించారు. ‘‘ నా వ్యక్తిగత కారణాలు కొన్ని ఇతర కట్టుబాట్ల కారణంగా పంజాబ్ గవర్నర్ పదవికి, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. దయచేసి దానిని ఆమోదించండి’’ అని పురోహిత్ (84) తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

ఔరంగజేబు మథుర శ్రీకృష్ణ దేవాలయాన్ని కూలగొట్టాడు - ఆగ్రా పురావాస్తు శాఖ

ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన మరుసటి రోజే పురోహిత్ రాజీనామా చేయడం గమనార్హం. పంజాబ్ గవర్నర్ గా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గా నియమితులు కాకముందు పురోహిత్ 2016 నుంచి 2017 వరకు అసోం గవర్నర్ గా, 2017 నుంచి 2021 వరకు తమిళనాడు గవర్నర్ గా పనిచేశారు. గవర్నర్ గా రెండేళ్లకు పైగా పనిచేసిన పురోహిత్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, వైస్ చాన్స్ లర్ల నియామకం సహా పలు అంశాలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో విభేదించారు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం కుమారి ఆంటీ రికమండేషన్... నిరుద్యోగ యువత కోరిందిదే..!

రాజ్ భవన్, పంజాబ్ ఆమ్ ఆద్మీ సర్కార్ లకు మధ్య తత్సంబధాలు పెద్దగా లేవు. లేడ్ రిజిమ్ ప్లాన్ ను గవర్నర్ తిరస్కరించడంతో వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తరువాత పలు మార్లు ఇలాంటివే జరిగింది. పురోహిత్ బాబా ఫరీద్ ఆరోగ్య శాస్త్ర విశ్వవిద్యాలయంలో కార్డియోలజిస్ట్ ను ఫాకల్టీగా నియమించడాన్ని కూడా గవ్నర్ తిరస్కరించారు. అయితే బీజేపీ ప్రోద్బలంతోనే ప్రభుత్వ కార్యకలాపాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని ఆప్ ఆరోపణలు చేసింది. రాజ్ భవన్ బీజేపీ ప్రధాన కార్యాలయంగా మారిందని పలు మార్లు భగవంత్ మాన్ ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios