Aam Aadmi Party: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్) చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే.. పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ సింగ్ ఆప్ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం భగవంత్ మాన్ సింగ్ ఆప్ ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యేలందరూ తమ తమ నియోజకవర్గాల్లోనే ఎక్కువ సమయం ఉండాలని, అంతేగానీ పార్టీ ఆఫీసులో గానీ, రాజధానిలో మకాం వేయవద్దని హుకూం జారీ చేశారు.