నిర్భయ కేసులో దోషి ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ శుక్రవారం నాడు తిరస్కరించారు.

Also read:నిర్భయ కేసులో ముఖేష్ సింగ్‌కు షాక్: మెర్సీ పిటిషన్ తిరస్కరణ

నిర్భయ కేసులో దోషి ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ను గురువారం నాడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్  క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించారు.  ఈ పిటిషన్ ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఆయన పంపారు.

Also read:నిర్భయ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్: దోషులకు ఉరిశిక్ష మరింత ఆలస్యం

Also read:నిర్భయ కేసులో ట్విస్ట్: రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన ముఖేష్ సింగ్

కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు గురువారం నాడు రాత్రి  ముఖేష్ సింగ్ పిటిషన్‌ను పంపారు.ఈ పిటిషన్‌తో పాటు నిర్భయ కేసులో దోషిగా ఉన్న ముఖేష్ సింగ్‌ కు క్షమాభిక్షను ఇవ్వకూడదని కేంద్ర హోంశాఖ కూడ రాష్ట్రపతికి సిపారసు చేసింది.

Also read:ఉరిశిక్ష: నాడు ఆ నలుగురు, ఇప్పుడు నిర్భయ దోషులు

వీటన్నింటిని పరిశీలించిన తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  ముఖేష్ సింగ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు.ఇప్పటికే ఈ నెల 22వ తేదీన  ఈ నలుగురిని ఉరి తీయాలని నిర్ణయం  తీసుకొన్నారు. ఈ నలుగురికి డెత్ వారంట్ జారీ చేశారు

న్యాయ సూత్రాల ప్రకారంగా క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన 14 రోజుల తర్వాతే ఉరి తీయాలి. అయితే ఇప్పటికే దోషులకు  డెత్ వారంట్ జారీ చేశారు. అయితే రాాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించడంతో ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది.

నిర్భయ దోషుల తరపున వాదిస్తున్న న్యాయవాది మాత్రం న్యాయసూత్రాల ప్రకారంగానే 14 రోజులపాటు వ్యవధిని ఇవ్వాలని  కోరుతున్నట్టుగా సమాచారం. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

2012 డిసెంబర్ 16వ తేదీన నిర్భయపై ఈ దోషులు గ్యాంగ్‌రేప్ కు పాల్పడ్డారు. స్నేహితుడితో కలిసి సినిమా చూసి వస్తున్న నిర్భయను వీరు బస్సులోనే రేప్ చేశారు. తీవ్రంగా గాయపడిన నిర్భయ సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 29వ తేదీన మృతి చెందింది..

దీంతో భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు వీలుగా నిర్భయ చట్టాన్ని కూడ కేంద్రం తీసుకొచ్చింది. కానీ, ఈ తరహా ఘటనలు మాత్రం ఆగలేదు.